Begin typing your search above and press return to search.

పెద్ద స్టార్ అవ్వాలని ఉంది.. డాడీ నేర్పించట్లేదు.. మహేష్ గారాల పట్టి

By:  Tupaki Desk   |   2 Jan 2021 4:00 PM IST
పెద్ద స్టార్ అవ్వాలని ఉంది.. డాడీ నేర్పించట్లేదు.. మహేష్ గారాల పట్టి
X
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూతురిగా అందరికీ తెలిసిన ‘సితార’.. క్రమంగా సింగిల్ గానే ఫేమస్ అవుతోంది. తరచూ పలు ఈవెంట్లలో పాల్గొంటూ.. సోషల్ మీడియాలో తన వీడియోలు పోస్ట్ చేస్తూ.. అందరికీ నోటెడ్ అవుతోంది సితార. లేటెస్ట్ గా న్యూ ఇయర్ రోజున ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడింది. తన ప్రస్తుత లైఫ్ తోపాటు ఫ్యూచర్ డ్రీమ్స్ కూడా షేర్ చేసుకుంది ఈ స్టార్ డాటర్. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

నాకు దొరికిన వరం..
మా డాడీ మహేష్ బాబు.. మమ్మీ నమ్రత.. సోదరుడు గౌతమ్ తో కూడిన కుటుంబంలో నేను ఉన్నందుకు గొప్ప అదృష్టంగా భావిస్తాను. నాకు ఇంత గుర్తింపు వచ్చిందంటే మా ఫ్యామిలీ వల్లే. ఈ ఫ్యామిలీని ఇచ్చినందుకు నేను దేవుడికి థ్యాంక్స్ చెప్తా. నాకు నాన్న అంటే చాలా ఇష్టం. నాన్న ఇంట్లో ఉంటే ఆయనతోనే ఉంటాను. షూటింగు వెళ్తే మాత్రం అమ్మతో ఉంటా.

నేను ఆ హీరో అభిమానినే..
మా నాన్నే నా ఫేవరెట్ హీరో. ఆయన సినిమాలు మాత్రమే ఎక్కువగా చూస్తాను. మిగిలిన సినిమాలు పెద్దగా చూడను. వేరే హీరోల గురించి పెద్దగా తెలియదు. ఫ్యూచర్ లో నేను కూడా పెద్ద స్టార్ అవ్వాలనుకుంటున్నాను. కానీ.. నాన్నను యాక్టింగ్ గురించి అడిగితే చెప్పరు. నాకు యాక్టింగ్ నేర్పించమంటే నేర్పించరు.

గౌతమ్‌తో కలిసి..
నా సోదరుడు గౌతమ్‌తో కలిసి కూడా నటించాలని ఉంది. కానీ.. ఆ కోరిక ఎప్పుడూ తీరుతుందో తెలియదు. ఆ ఛాన్స్ కోసం నేను ఎదురుచూస్తున్నాను. మా తమ్ముడు మాత్రం ఆ ఛాన్స్ ఇప్పటికే కొట్టేశాడు. నాన్నతో కలిసి గౌతమ్న నటించాడు. నాకు కూడా నాన్నతో కలిసి నటించాలని ఉంది.

నచ్చిన హీరోయిన్ ఆమె..
నాకు హీరోయిన్ రష్మిక మందన్న అంటే చాలా ఇష్టం. ఆమె నాతో ఫన్నీగా, చాలా క్లోజ్ గా ఉంటుంది. ఆమెతో టైమ్ చాలా గడిచిపోతుంది. నాతో చాలా చక్కగా మాట్లాడుతుంది. అందుకే ఆమె అంటే ఇష్టం ఏర్పడింది.