Begin typing your search above and press return to search.

తమ్ముడు బెల్లంకొండ లక్కీ గురూ

By:  Tupaki Desk   |   3 April 2021 5:38 AM GMT
తమ్ముడు బెల్లంకొండ లక్కీ గురూ
X
నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటికే హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పలు చిత్రాలు చేసిన సాయి శ్రీనివాస్ సక్సెస్‌ ఫ్లాప్ ల గురించి పట్టించుకోకుండా కెరీర్ లో దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం ఈ బెల్లంకొండ హీరో సూపర్‌ హిట్‌ మూవీ చత్రపతి రీమేక్ తో బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. మరో వైపు బెల్లంకొండ సురేష్‌ చిన్నబ్బాయి గణేష్‌ కూడా హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. గత ఏడాది గణేష్‌ మొదటి సినిమా పవన్ సాధినేని దర్శకత్వంలో ప్రారంభం అయ్యింది. అనుకోని కారణాల వల్ల లాక్ డౌన్‌ తర్వాత సినిమా మళ్లీ ప్రారంభం అవ్వడం లేదు. మొదటి సినిమా అలా ఉండగానే రెండవ సినిమాను గణేష్‌ దక్కించుకున్నాడు.

టాలీవుడ్‌ లో ప్రస్తుతం మోస్ట్‌ యాక్టివ్‌ నిర్మాణ సంస్థగా సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్ పేరు దక్కించుకుంది. పెద్ద చిన్న స్టార్‌ లతో సితార వారు వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. అందులో భాగంగా బెల్లంకొండ గణేష్‌ తో ఒక సినిమాను సితార ఎంటర్‌ టైన్ మెంట్స్ ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కొత్త దర్శకుడు చెప్పిన కథను ఇప్పటికే గణేష్‌ కోసం ఓకే చెశారట. అతి త్వరలోనే సితార ఎంటర్ టైన్‌ మెంట్స్ బ్యానర్‌ లో బెల్లంకొండ గణేష్‌ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. సితార ఎంటర్ టైన్‌ మెంట్స్ లో సినిమా అంటే ఖచ్చితంగా గణేష్‌ లక్కీ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదటి సినిమా విడుదల కాకుండానే రెండవ సినిమాను సితార వారి బ్యానర్‌ లో చేసే అవకాశం దక్కించుకున్న తమ్ముడు బెల్లంకొండ గణేష్‌ లక్కీ గురూ అంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.