Begin typing your search above and press return to search.

సీతారామం 2వ రోజు కలెక్షన్స్.. అంతకుమించి

By:  Tupaki Desk   |   7 Aug 2022 9:30 AM GMT
సీతారామం 2వ రోజు కలెక్షన్స్.. అంతకుమించి
X
దుల్కర్ సల్మాన్ - మృనల్ ఠాగూర్ జంటగా నటించిన సీతారామం సినిమా మొదటి రోజే పాజిటివ్ టాక్ తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి లవ్ స్టోరీ సినిమా జనాలు చూస్తారా లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో సరైన కంటెంట్ తో వస్తే ఎలాంటి సినిమా అయినా చూస్తారు అని సీతారామం సినిమా రుజువు చేసింది.

హను రాగవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ సినిమా అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద మొదటి రెండు రోజుల్లో మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 1.50 కోట్ల షేర్ వసూళ్లను సొంతం చేసుకుంది.

ఇక రెండవ రోజు అంతకంటే ఎక్కువ వచ్చాయి. ఏరియాల వారిగా చూసుకుంటే నైజం లో 85 లక్షలు, సీడెడ్ లో 21 లక్షలు, ఉత్తరాంధ్రలో 32 లక్షలు, ఈస్ట్ గోదావరి లో 19 లక్షలు, వెస్ట్ గోదావరిలో 12, లక్షలు గుంటూరులో 14 లక్షలు, కృష్ణ లో 17 లక్షలు, నెల్లూరులో 8 లక్షలు వచ్చాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో కలుపుకొని 2.08 కోట్ల షేర్ సాధించిన సీతారామం సినిమా కర్ణాటక ఓవర్సీస్ లో 35 లక్షల వసూళ్లను సాధించింది.

ఇక ఇతర భాషల్లో 90 లక్షలను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో మాత్రం ఊహించిన దాని కంటే మరింత ఎక్కువ వసూళ్లను అందుకుంటుంది. యూఎస్ 400k డాలర్స్ అందుకొని మరింత హైప్ క్రియేట్ చేసింది. దాదాపు ఓవర్సీస్ లోనే ఈ సినిమా 1.85 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సీతారామం సినిమా రెండు రోజుల్లో 6.68 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక తమిళంలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో అక్కడ షోల సంఖ్యను కూడా పెంచుతున్నట్లుగా తెలుస్తోంది. మరి మొత్తంగా ఈ సినిమా ఇంకా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.