Begin typing your search above and press return to search.

సీతా పాపా ఆ ట్యాబ్ లో ఏం చూస్తున్నావ్?

By:  Tupaki Desk   |   30 Aug 2020 10:10 AM GMT
సీతా పాపా ఆ ట్యాబ్ లో ఏం చూస్తున్నావ్?
X
క్యూట్ సితార‌.. గౌత‌మ్ తో క్వారంటైన్ స‌మ‌యాన్ని న‌చ్చిన‌ట్టు ఎంజాయ్ చేస్తున్నారు సూప‌ర్ స్టార్ మ‌హేష్. గారాల ప‌ట్టీ సితార అయితే డాడీని తెగ ఆట‌ప‌ట్టించేస్తోంది. సితార ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఆస‌క్తిగా డ్యాన్సులు చేస్తూ ఉన్న‌ ల‌వ్ లీ వీడియోల్ని న‌మ్ర‌త‌ ఇదివ‌ర‌కూ షేర్ చేశారు.

ఫ్యామిలీ లైఫ్ లో ప్ర‌తి మూవ్ మెంట్ ని కెమెరాలో క్యాప్చుర్ చేస్తూ న‌మ్ర‌త సోష‌ల్ మీడియాల్లో జ‌రంత స్పీడ్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా డాడీ అండ్ డాట‌ర్ ఎక్స్ క్లూజివ్ ఫోటోని న‌మ్ర‌త ఇన్ స్టాలో షేర్ చేశారు. తండ్రి-కూతుళ్ల ఆట‌లు చూస్తున్నారుగా.. ఈ చిత్రంలో. సీతా పాప తన ట్యాబ్ ‌లో ఏదో చూస్తుండగా.. డాటింగ్ నాన్న త‌న‌ పక్కనే కూర్చుని హార్ట్ ఫుల్ గా చిరున‌వ్వులు చిందిస్తున్నారు.

“గాడ్జెట్ సమయం ముగిసింది” అంటూ నమ్రతా ట్యాగ్ లైన్ ఇచ్చారు మ‌రి. లాక్ డౌన్ లో నమ్రత తన పిల్లల కు సంబంధించిన అనేక ఫోటోలు.. వీడియోలను ఇన్ స్టాలో పంచుకుంటున్నారు. మహేష్ దాదాపు ఒక సంవత్సరం పాటు షూటింగ్ చేయనందున ఘట్టమనేని కుటుంబం ఈ ఖాళీ స‌మ‌యాన్ని ఫుల్ గా ఆస్వాధించింది. పూర్తిగా కుటుంబానికే మ‌హేష్ స‌మ‌యం కేటాయించ‌డంతో అంద‌రిలో ఆ హ్యాపీనెస్ క‌నిపిస్తోంది. జ‌న‌వ‌రి నుంచి ప‌ర‌శురామ్ తో `స‌ర్కార్ వారి పాట‌` సెట్స్ కెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే.