Begin typing your search above and press return to search.

ఫస్ట్‌ లుక్‌ : 'సీత' వచ్చేసింది

By:  Tupaki Desk   |   26 Jan 2019 7:09 AM GMT
ఫస్ట్‌ లుక్‌ : సీత వచ్చేసింది
X
'కవచం' చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్‌ మరియు కాజల్‌ లు ప్రస్తుతం తేజ దర్వకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రానికి 'సీత' అనే టైటిల్‌ చాలా రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. నిన్న ఆ టైటిల్‌ పై క్లారిటీ ఇస్తూ లోగోను ఆవిష్కరించారు. ఇక నేడు రిపబ్లిక్‌ డే సందర్బంగా సీత ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను ఆవిష్కరించారు. పోస్టర్‌ చాలా సింపుల్‌ గా కాజల్‌ మరియు బెల్లంకొండ శ్రీనివాస్‌ కలిసి ఉన్న స్టిల్‌ ను విడుదల చేశారు.

కవచం మాదిరిగా కాకుండా ఈ చిత్రం క్లాస్‌ గా, ఫ్యామిలీ ఆడియన్స్‌ ను అలరించే విధంగా ఉంటుందని ఫస్ట్‌ లుక్‌ చూస్తుంటే అనిపిస్తుంది. సీత అనే టైటిల్‌ ను బట్టి ఈ చిత్రం హీరోయిన్‌ ప్రధానంగా సాగుతుందనిపిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం టీజర్‌ ను కూడా విడుదల చేయబోతున్నారు. సమ్మర్‌ లో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. తేజ గత చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ చిత్రంపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. కవచంతో ఆకట్టుకోలేక పోయిన ఈ కాంబో సీతతో మెప్పిస్తారనే నమ్మకం వ్యక్తం అవుతోంది.