Begin typing your search above and press return to search.

కెల్విన్ ఎపిసోడ్ లో ఛార్మికి షాక్ మీద షాక్‌?

By:  Tupaki Desk   |   27 July 2017 4:34 AM GMT
కెల్విన్ ఎపిసోడ్ లో ఛార్మికి షాక్ మీద షాక్‌?
X
ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు సంధిస్తున్న అధికారుల‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానాలు చెప్ప‌టం ద్వారా ఛార్మి చాలా తెలివిని ప్ర‌ద‌ర్శించింద‌న్న మాట అధికార వ‌ర్గాల్లో వినిపిస్తోంది. డ్ర‌గ్స్ విచార‌ణ‌లో అధికారుల ఎదుట హాజ‌రైన మొట్ట‌మొద‌టి మ‌హిళా సెల‌బ్రిటీ ఛార్మినే.

ముందుస్తుగా పేర్కొన్న‌ట్లే అధికారులు పేర్కొన్న స‌మ‌యానికి కంటే ముందుగా వ‌చ్చేసిన ఛార్మి.. విచార‌ణ సంద‌ర్భంలో చాలా ప్ర‌శ్న‌ల‌కు త‌న‌కేమీ తెలీద‌న్న స‌మాధానాన్నే చెప్పిన‌ట్లుగా స‌మాచారం. కెల్విన్ తో ప‌రిచ‌యం ఏమిట‌న్న ప్ర‌శ్న‌కు.. ఈవెంట్ వ‌ర్గాల ద్వారా ప‌రిచ‌య‌మైంద‌ని.. అది ఉత్త ప‌రిచ‌య‌మే అని చెప్పిన‌ట్లుగా స‌మాచారం. జ్యోతిల‌క్ష్మి సినిమా ప్ర‌మోష‌న్ సంద‌ర్భంగా కెల్విన్ తో స‌న్నిహితంగా సెల్ఫీలు దిగిన వైనాన్ని ప్ర‌శ్నించిన వేళ‌లోనూ.. ఛార్మి ఎప్ప‌టి మాదిరే త‌న‌దైన శైలిలో స‌మాధానాలు చెప్పినట్లుగా స‌మాచారం.

అయితే.. ఆ సెల్ఫీల‌ను ఛార్మికి చూపించ‌టంతో మొద‌టిసారి షాక్ తిన్న‌ట్లుగా తెలుస్తోంది. అనంత‌రం సెల్ఫీల గురించి క‌వ‌ర్ చేసేలా మాట్లాడిన ఛార్మి మ‌రోసారి షాక్ తినేలా సిట్ అధికారులు వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా తెలుస్తోంది. సెల్ఫీలు దిగ‌టానికి కాస్త ముందు.. కెల్విన్‌.. ఛార్మిల మ‌ధ్య జ‌రిగిన వాట్సాప్ ఛాట్‌ ను ఛార్మి ఎదుట పెట్టిన‌ట్లుగా స‌మాచారం. దీంతో.. ఆమె కంగు తిన్న‌ట్లుగా తెలుస్తోంది. దాదాపు ఆరున్న‌ర గంట‌ల‌కు పైనే విచార‌ణ‌ను ఎదుర్కొన్న ఛార్మి.. కెల్విన్ ఎపిసోడ్ విష‌యంలో స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో డ‌బుల్ షాక్ ఎదురైన‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. త‌న‌కేమాత్రం సంబంధం లేద‌న్న మాట‌కే ఛార్మి క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లుగా స‌మాచారం. ఛార్మికి పూరీతోనూ.. కెల్విన్ తో ఉన్న సంబంధాల‌పై గ‌తంలో వారి నుంచి సేక‌రించిన స‌మాచారాన్ని క్రాస్ చెక్ చేసుకునేలా ఆమెకు ప్ర‌శ్న‌లు సంధించిన‌ట్లుగా తెలుస్తోంది.