Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌ కు చెల్లి పాత్రలు సమస్య

By:  Tupaki Desk   |   17 Aug 2021 1:30 AM GMT
మెగాస్టార్‌ కు చెల్లి పాత్రలు సమస్య
X
మెగా స్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ దాదాపుగా ముగిసింది. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసినట్లుగా కొరటాల శివ అధికారికంగా ప్రకటించాడు. ఆచార్య ను ముగించిన వెంటనే లూసీఫర్ సినిమా రీమేక్ ను చిరంజీవి పట్టాలెక్కించాడు. మోహన్‌ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రీమేక్ కు సంబంధించిన చిత్రీకరణ ఇటీవలే మొదలు అయ్యింది. పెద్ద ఎత్తున అంచనాలున్న మెగాస్టార్ చిరంజీవి లూసీఫర్‌ సినిమా చిత్రీకరణ మొదలు అయ్యింది కాని ఇప్పటి వరకు ఆ సినిమాలో కీలకమైన చెల్లి పాత్రను చేయబోతున్నది ఎవరు అనే విషయమై స్పష్టత రాలేదు. లూసీఫర్ లో మోహన్‌ లాల్‌ కు సోదరి పాత్రలో మంజు వారియర్ కనిపించింది. ఇద్దరికి చాలా బాగా సెట్‌ అయ్యింది. ఇద్దరు కూడా మంచి నటనతో బందంను రక్తి కట్టించారు. ఇప్పుడు ఆ పాత్రలను చేయబోతున్నది చిరంజీవి మరియు నయన్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు హీరోయిన్ గా చిరంజీవికి జోడీగా నయన్ ను నటింపజేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఉన్నట్లుండి నయన్ ను చిరంజీవికి సోదరి అంటూ ప్రచారం చేస్తున్నారు. మెగాస్టార్ వంటి సీనియర్ స్టార్‌ హీరోయిన్ కు నయనతార సోదరిగా నటించడం ఏమాత్రం ఆమోద యోగ్యం కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరు కలిసి సైరా సినిమాలో నటించారు. ఆ సినిమాలో భార్య భర్తలుగా నటించిన వారు ఇప్పుడు అన్నా చెల్లిగా నటిస్తే ఫ్యాన్స్ ప్రేక్షకులు ఎలా రియాక్ట్‌ అవుతారు అనేది కాస్త చర్చనీయాంశం. అంతే కాకుండా చిరంజీవి మరియు నయనతార వంటి ఇద్దరు స్టార్స్‌ ను అన్నా చెల్లిగా చూపించడం అంటే అది పెద్ద అవివేక నిర్ణయం అవుతుందని కూడా ఇప్పటి నుండే నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మంజు వారియర్ పాత్రకు గాను చాలా మంది సీనియర్‌ హీరోయిన్స్ ఉన్నారు. వారిలో ఎవరినో ఒకరిని తీసుకుని కానిచ్చేస్తే సరిపోతుంది. అంతే కాని నయన్ ను నటింపజేయడం మంచి నిర్ణయం కాదంటున్నారు. మొత్తానికి మెగాస్టార్ లూసీఫర్ సినిమాకు సంబంధించిన చెల్లి పాత్ర ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ గా ఉంది.

లూసీఫర్ సినిమాకు మాత్రమే కాకుండా వేదాళం సినిమాకు కూడా చెల్లి పాత్ర అవసరం ఉంది. ఆ రీమేక్ లో చెల్లి పాత్రకు గాను కీర్తి సురేష్‌ ను దర్శకుడు మెహర్‌ రమేష్‌ ఎంపిక చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే చిరంజీవికి చెల్లి పాత్రకు ఆమె ఓకే చెప్పిందని అఫిషియల్‌ గా అగ్రిమెంట్‌ చేయాల్సి ఉందని అంటున్నారు. కీర్తి సురేష్‌ వంటి మోస్ట్‌ హ్యాపెనింగ్‌ బ్యూటీని చిరంజీవికి జోడీగా కాకుండా చెల్లి పాత్రకు నటింపజేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని ఇప్పటికే కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చిరంజీవి ఈ రెండు సినిమాల చెల్లి పాత్రలు పెద్ద సమస్యగా మారాయి. చిన్న చితకా వారిని పెడితే సినిమా స్థాయి తగ్గుతుంది. అలా అని స్టార్‌ హీరోయిన్ ను నటింపజేస్తే అప్పుడు చిరంజీవికి చెల్లి పాత్రలో స్టార్‌ హీరోయిన్‌ ఎంటీ అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు ఇలాంటి సమస్య లేకుండా చిరంజీవి చెల్లి పాత్ర ప్రాముఖ్య ఉన్న కథలను ఎంపిక చేసుకోవద్దు అంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఇద్దరు చెల్లెల్ల పాత్రలు ఇంకా ఖరారు రాలేదు. కాని వీరిద్దరు దాదాపుగా ఎంపిక అయ్యారు అని.. త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.