Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ స్పేస్ కరెక్ట్ కాదన్న సిరివెన్నెల

By:  Tupaki Desk   |   1 Feb 2019 5:30 AM GMT
త్రివిక్రమ్ స్పేస్ కరెక్ట్ కాదన్న సిరివెన్నెల
X
మాటల మాంత్రికుడిగా దర్శకుడు రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు కాని ఆయనన్న మాటను నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఇటీవలే పద్మశ్రీ పురస్కారం ప్రకటించబడిన గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కాదని చెప్పడం చిన్న షాక్ ఇచ్చింది. అయితే అది నెగటివ్ గా కాదు లెండి. పాట రచన గురించి గంటకు పైగా సాగిన ప్రెస్ మీట్ లో ఏకధాటిగా మాట్లాడిన సిరివెన్నెల ఎన్నడూ లేనిది మొదటిసారి ఇంత సేపు మీడియాతో గడిపారు.

గతంలో ఓసారి త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన వ్యవహారాల్లో ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది వేరొకరి జోక్యం ఉండకూడదు అని అర్థం వచ్చేలా చెప్పిన స్టేట్ మెంట్ ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. పెట్టుబడి పెట్టె నిర్మాతలకు అన్ని తెలిసి ఉండవు కాబట్టే 24 క్రాఫ్ట్స్ కు సంబంధించి ఎందరో నిపుణులను తీసుకుంటారని వివరించారు. అయితే పాటతో పాటు అన్ని సాంకేతిక శాఖలకు ఒకే బాద్యత ఉంటుందని అది సక్రమంగా నిర్వర్తించాలి అంటే త్రివిక్రమ్ వద్దని చెప్పిన స్పేస్ తీసుకోవాలని చెప్పారు.

పరస్పర అవగాహన ఉంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని సిరివెన్నెల ఉద్దేశం. గత కొంత కాలంగా చాలా సెలెక్టివ్ గా పాటలు రాస్తున్న సిరివెన్నెల చాలా కాలం తర్వాత సైరా నరసింహ రెడ్డికి సింగల్ కార్డు గా అన్ని గీతాలకు సాహిత్యం సమకూరుస్తున్నారు. కథను ప్రేమిస్తే తప్ప పాటలు రాయలేను అంటున్న శాస్త్రి గారు ఇప్పుడు పాట రచన అంటే పదాల కూర్పుగా మారిపోయిందని ఇది తప్పని ఇలాంటి సాహిత్యం నిలవదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ ప్రస్తావన తెచ్చారు సిరివెన్నెల. ఈ ఇద్దరికీ ఉన్న బంధుత్వం అందరికి తెలిసిందే. పద్మశ్రీ పురస్కారం ప్రకటించగానే మొదట వెళ్లి అభినందించింది త్రివిక్రమే