Begin typing your search above and press return to search.

#BiggBoss5 : పొట్టి పిల్లకు గట్టి సపోర్ట్‌ ఉంది

By:  Tupaki Desk   |   7 Sep 2021 4:34 AM GMT
#BiggBoss5 : పొట్టి పిల్లకు గట్టి సపోర్ట్‌ ఉంది
X
సోషల్‌ మీడియా ద్వారా పరిచయం అయ్యి యూట్యూబ్‌ లో స్టార్ గా గుర్తింపు దక్కించుకుని జబర్దస్త్ లో సందడి చేసి అటు నుండి స్టార్ మాలో కామెడీ స్టార్స్ తో మరింత పాపులారిటీ దక్కించుకుంది. గత నాలుగు అయిదు నెలలుగా బిగ్‌ బాస్ లో ఈమె ఉంటుంది అంటూ ప్రచారం జరిగింది. అన్నట్లుగానే మొట్ట మొదటి కంటెస్టెంట్‌ గా హౌస్ లోకి అడుగు పెట్టింది. ఆమె సోషల్‌ మీడియా సెన్షేషన్‌ సిరి హనుమంతు. డాన్స్ లు.. ఎనర్జిటిక్‌ ఫెర్ఫార్మెన్స్ ఇంకా అందరితో కలిసి పోయే గుణం ఇలా అన్ని విషయాల్లో కూడా సిరికి మంచి మార్కులు పడుతాయి. కనుక అమ్మాయిల్లో టాప్ 5 కి వెళ్లే అర్హత సిరికి ఉంది అంటూ చాలా మంది బలంగా నమ్ముతున్నారు. హౌస్‌ లో ఎంత ఫెర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా బయట ఆమెకు మద్దతు దారులు ఉండాలి. ఆ విషయంలో ఆమె తోపు అంటూ ట్విట్టర్‌.. ఇన్ స్టా ఓపెన్‌ చేస్తే అర్థం అవుతోంది.

ట్విట్టర్ లో మరియు ఇన్ స్టా గ్రామ్‌ లో ఆమె పేరు మారు మ్రోగిపోతుంది. సిరి హనుమంతు గురించి సోషల్‌ మీడియా స్టార్స్ చాలా మంది చర్చిస్తున్నారు. తమ వర్గంకు చెందిన అమ్మాయి అంటూ చాలా మంది యూట్యూబ్‌ స్టార్స్.. సోషల్‌ మీడియా సెలబ్రెటీలు సిరికి మద్దతుగా నిలుస్తున్నారు. యూట్యూబ్‌ ద్వారా మంచి ఫేమ్‌ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ సిరి కి అక్కడ కూడా పెద్ద ఎత్తున మద్దతు దక్కుతుంది. మొత్తానికి సిరి ఖచ్చితంగా ఓ సెన్షేషన్ గా నిలుస్తుందని.. ఆమెకు ఓట్ల పరంగా మంచి ఆధరణ వస్తుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

బుల్లి తెర.. సోషల్‌ మీడియా.. యూట్యూబ్‌ ఇలా అన్ని చోట్ల కూడా సిరిని చూసిన వారు ఆమె నామినేషన్‌ లో ఉంటే కళ్లు మూసుకుని ఓట్లు వేస్తారు. అందుకే ఆమెకు గట్టి పోటీ ఉందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఎనర్జితో పాటు ఆమెకు ఉన్న బయట మద్దతు కారణంగా ఈజీగా నెట్టుకు రాగలదు అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. పొట్టి పిల్ల అయినా కూడా సిరి ఖచ్చితంగా గట్టి పిల్ల.. ఆమెకు గట్టి సపోర్ట్‌ కూడా ఉంది అనేది సోషల్‌ మీడియా టాక్‌. మరి ముందు ముందు ఎలా ఉంటుంది అనేది చూడాలి. బిగ్‌ బాస్ లో వారం వారం పరిస్థితులు మారుతూ ఉంటాయి.