Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : సార్
By: Tupaki Desk | 18 Feb 2023 2:30 AM IST'సార్' మూవీ రివ్యూ
నటీనటులు: ధనుష్-సంయుక్త-సముద్రఖని-సాయికుమార్-తనికెళ్ల భరణి-తోటపల్లి మధు-హైపర్ ఆది-నర్రా శీను-ఆడుగళం నరేన్ తదితరులు
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: యువరాజ్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ-సాయి సౌజన్య
రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి
ఈ మధ్య తమిళ కథానాయకులు ఒక్కొక్కరుగా తెలుగులోకి అడుగు పెడుతున్నారు. తెలుగు దర్శకులతో కలిసి తమిళ-తెలుగు ద్విభాషా చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ కోవలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరితో చేసిన సినిమా 'సార్'. ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
బాలగంగాధర్ తిలక్ అలియాస్ బాలు (ధనుష్) ఒక ప్రైవేటు కాలేజీలో జూనియర్ లెక్చరర్. అతను పని చేసే విద్యాసంస్థల అధినేత త్రిపాఠి (సముద్రఖని).. ఫీజుల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వ తీసుకొస్తున్న కొత్త నిబంధన ప్రైవేటీ కాలేజీల మనుగడకు ప్రమాదంగా మారుతుందన్న ఆందోళనతో ఒక ఎత్తుగడ వేస్తాడు. ఆదరణ కోల్పోతున్న ప్రభుత్వ కాలేజీలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటిస్తాడు. అందులో భాగంగా తమ కాలేజీల్లో పని చేసే థర్డ్ గ్రేడ్ లెక్చరర్లను ప్రభుత్వ కళాశాలలకు పంపిస్తాడు. ఈ క్రమంలో బాలు సిరిపురంలోని ప్రభుత్వ కాలేజీకి వెళ్తాడు. కానీ అక్కడ అతడికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కాలేజీలో ఒక్క స్టూడెంట్ కూడా ఉండడు. రకరకాల కారణాలతో కాలేజీకి దూరమైన విద్యార్థులను ఒప్పించి క్లాస్ రూంకు తీసుకొచ్చిన బాలు.. వారితో ఏం సాధింపజేశాడు? త్రిపాఠి ఎత్తుగడకు ఎలా అడ్డుకట్ట వేశాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
'మంచి సినిమా' అంటే అదేదో ఒక బూతు మాటలా మారిపోయింది ఈ రోజుల్లో. హీరోను మంచివాడిగా చూపించి.. కథలో మంచి విషయాలు చెప్పి.. ఒక మంచి సందేశం ఇస్తామంటే.. చాలు బాబూ మీ మంచికో దండం అనే రోజులు వచ్చేశాయి. హీరో పాత్ర చిత్రణ కొంచెం తేడాగా ఉంటేనే విజిల్స్ పడుతున్న ఈ రోజుల్లో.. ఒక పల్లెటూరికి చెందిన పిల్లలకు చదువు చెప్పి వారిని ఉన్నత విద్యావంతుల్ని చేయడానికి పాటు పడే ఒక ఉపాధ్యాయుడి కథ చెప్పాలని యువ దర్శకుడు వెంకీ అట్లూరికి అనిపించడం.. ఆ పాత్ర చేయడానికి తమిళ స్టార్ హీరో ధనుష్ ముందుకు రావడం.. అన్నింటికీ మించి ఈ రోజుల్లో ఇలాంటి సినిమా వర్కవుట్ అవుతుందని నమ్మి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పెట్టుబడి పెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయాలే. ఐతే నిజాయితీగా చేసే ఏ ప్రయత్నం అయినా.. ప్రేక్షకులను మెప్పిస్తుందనడానికి 'సార్' రుజువుగా నిలుస్తుంది. ఇదేమీ క్రేజీగా అనిపించే సినిమా కాదు.. ఈ కథ అంత కొత్తగా ఏమీ అనిపించదు.. కథనంలో పెద్ద సర్ప్రైజులేమీ ఉండవు.. సినిమా అంతా అంచనాలకు తగ్గట్లే సాగిపోతుంది. కానీ అందరూ కనెక్ట్ అయ్యే కథ.. ఆ కథను నిజాయితీగా చెప్పిన విధానం.. ధనుష్ పెర్ఫామెన్స్.. సరిగ్గా పండిన ఎమోషన్లు 'సార్'ను నిలబెట్టాయి.
పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చి ఐఐటీయన్లను చేసిన సూపర్ 30 ఆనంద్ జీవిత కథ ఆధారంగా హిందీలో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో 'సూపర్ 30' సినిమాకు సౌత్ వెర్షన్ లాగా చెప్పొచ్చు 'సార్'ను. కథ పరంగా దాంతో దీనికి చాలా పోలికలు కనిపిస్తాయి. ఆ కథనే కొంచెం అటు ఇటు మార్చి దక్షిణాది ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఇంకాస్త 'కమర్షియలైజ్' చేశాడు వెంకీ అట్లూరి. వెంకీ తొలి మూడు చిత్రాలు చూసిన వాళ్లకు.. ఈ సినిమా చూస్తున్నపుడు కచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్లకు పేరుపడ్డ అతను.. సందేశంతో ముడిపడ్డ 'సార్'ను ఒక యజ్ఞం లాగా భావించాడని అర్థమవుతుంది. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్న మాట వాస్తవమే అయినా.. ఓవర్ హీరోయిజం.. ఈ కథ ఔచిత్యాన్ని దెబ్బ తీసే మసాలాల జోలికి వెళ్లకుండా కథే ప్రధానంగా సినిమాను నడిపించిన విధానం ఈ సినిమాకు ఒక ప్రత్యేకతను చేకూర్చింది.
సినిమాలో తొలి అరగంట హైపర్ ఆది పాత్ర బాగానే ఎంటర్టైన్ చేస్తున్నా సరే.. కథను సీరియస్ గా చెప్పాల్సిన అవసరం పడగానే ఆ క్యారెక్టర్ని ఉన్నట్లుండి కట్ చేసి పక్కన పెట్టేయడం దర్శకుడి సిన్సియారిటీకి నిదర్శనం. ద్వితీయార్ధంలో కామెడీ డోస్ లేకుంటే కష్టమని మళ్లీ ఆ పాత్రను తీసుకురావడమో.. ఇంకో కామెడీ క్యారెక్టర్ని ప్రవేశ పెట్టడమో.. లేదంటే హీరో హీరోయిన్ల మధ్య ఒక పాట పెడితే బాగుంటుందనో వెంకీ ఆలోచించలేదు. మొదట్లో వచ్చే కామెడీ సీన్లు కథలో భాగంగానే ఉంటాయి. హీరో హీరోయిన్లపై పాట కూడా కథను ముందుకు తీసుకెళ్లడానికే ఉపయోగపడుతుంది. 'సార్' కథేంటో ట్రైలర్లో మొత్తం చెప్పేశాక.. విలన్ ఉద్దేశమేంటో కూడా సినిమా ఆరంభంలోనే వెల్లడించేశాక.. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడానికి పెద్దగా స్కోప్ లేకపోయింది. ఇక సన్నివేశాలు కూడా మరీ కొత్తగా కూడా అనిపించవు. కానీ ప్రేక్షకులను ఆశ్చర్యపరచకపోయినా.. ఆలోచిపంజేసే.. కన్విన్సింగ్ గా అనిపించే సీన్లతో సినిమాను ముందుకు తీసుకెళ్లగలిగాడు వెంకీ. కొన్ని సీన్లు కాస్త ప్రీచీగా అనిపించినా ఎమోషన్లు బాగానే పండాయి. ప్రథమార్ధం ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా సాగిపోతుంది.
హీరోకు ఒక పెద్ద లక్ష్యం ఏర్పడడంతో ముగిసే ప్రథమార్ధం తర్వాత.. కమర్షియల్ ఫార్మాట్ ప్రకారం రెండో అర్ధం అతడికి ఎదురయ్యే అడ్డంకులు.. వాటిని అతను ఛేదించే నేపథ్యంలో ముందుకు సాగుతుంది. హీరో తాను పాఠాలు చెప్పే కాలేజీని.. ఊరిని విడిచి వెళ్లిపోవడానికి దారి తీసే సన్నివేశాల్లో మెలో డ్రామా డోస్ కొంచెం ఎక్కువైపోయింది. ఈ సీన్లు కొంచెం సాగతీతగా కూడా అనిపించి ఇబ్బంది పెడతాయి. కానీ ఆ తర్వాత 'సార్' మళ్లీ ట్రాక్ ఎక్కుతుంది. అన్ని అడ్డంకులనూ అధిగమించి హీరో.. ఒక కొత్త మార్గంలో పిల్లలకు పాఠాలు చెప్పడం.. వారు తమ లక్ష్యాన్ని అందుకునేలా చేయడం.. ఈ క్రమం ఆసక్తికరంగా సాగుతుంది. హీరో పాత్ర ఔన్నత్యాన్ని చాటేలా పతాక సన్నివేశాలను హృద్యంగా.. ఉద్వేగభరితంగా తెరకెక్కించి మార్కులు కొట్టేశాడు వెంకీ అట్లూరి. చివర్లో ఒక బలమైన సందేశం ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. కథాకథనాలు ప్రెడిక్టబుల్ అనిపించినా.. ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా సమయం గడిచిపోయేలా చేయడంలో 'సార్' విజయవంతం అయింది. సందేశంతో ముడిపడ్డ కథే అయినా.. అది సుగర్ కోటెడ్ లాగే ఉంటుంది కాబట్టి కమర్షియల్ సినిమాల ప్రియులు భయపడాల్సిన పని లేదు.
నటీనటులు:
ధనుష్ ఎంత మంచి నటుడో చెప్పడానికి 'సార్' మరో ఉదాహరణగా నిలుస్తుంది. అతను కెరీర్లో చాలా కాంప్లికేటెడ్ అనిపించే క్యారెక్టర్లు చాలా చేశాడు కానీ.. నిజానికి అతను ఒక మామూలు కుర్రాడిలా కనిపించినపుడే ఎక్కువ ఆకట్టుకుంటాడు. రఘువరన్ బీటెక్.. తిరు లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. 'సార్'లోనూ అతను 'సాధారణం'గానే కనిపిస్తాడు. కానీ ఆ పాత్రను అసాధారణ రీతిలో పోషించాడు. బాలు పాత్రను అతను ఓన్ చేసుకుని.. ప్రేక్షకులు కూడా ఓన్ చేసుకునేలా చేయగలిగాడు. ఎలివేషన్ సీన్లలో అదరగొడుతూనే.. ఎమోషనల్ సీన్లలో కదిలించేశాడు. సినిమాలో అతడిది వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. హీరోయిన్ సంయుక్త పర్వాలేదు. ఆమె అందం.. అభినయం ఓ మోస్తరుగా అనిపిస్తాయి. కొన్ని చోట్ల బాగా చేసినా.. కొన్ని సన్నివేశాల్లో బ్లాంక్ ఫేస్ పెట్టేసింది. విలన్ పాత్రలో సముద్రఖనికి పెద్దగా చేయడానికేమీ లేకపోయింది. విద్యార్థుల పాత్రల్లో కనిపించిన అబ్బాయిలు.. అమ్మాయిలు అందరూ బాగా చేశారు. సాయికుమార్ తన అనుభవాన్ని చాటాడు. తనికెళ్ల భరణి తనకు అలవాటైన పాత్రలో కనిపించాడు.
సాంకేతిక వర్గం:
జీవీ ప్రకాష్ కుమార్ 'సార్'కు తెర వెనుక హీరో. అతడి పాటల్లో మాస్టారు మాస్టారు పాట స్టాండౌట్ గా నిలుస్తుంది. మిగతా పాటలూ ఓకే. నేపథ్య సంగీతం సినిమాకు మేజర్ హైలైట్లలో ఒకటి. ఎమోషనల్ సీన్లలో హృద్యంగా అనిపిస్తూనే.. ఎలివేషన్ సీన్లలో గూస్ బంప్స్ ఇచ్చేలా నేపథ్య సంగీతం సాగింది. యువరాజ్ ఛాయాగ్రహణం అందంగా సాగింది. నిర్మాణ విలువలు సితార ప్రమాణాలకు తగ్గట్లే సాగాయి. వెంకీ అట్లూరి రచయితగా.. దర్శకుడిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు ఈ చిత్రంలో. అతడి తొలి మూడు చిత్రాలు చూసి.. ఇది చూస్తే అతనే ఈ సినిమా తీశాడంటే నమ్మలేం. రాతలో.. తీతలో అతను చూపించిన సిన్సియారిటీనే సినిమాకు అతి పెద్ద బలం. ఐతే కథ విషయంలో అతను 'సూపర్ 30' లాంటి కొన్ని సినిమాల నుంచి స్ఫూర్తి పొందాడన్నది స్పష్టం. సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవడం.. మెలోడ్రామా ఎక్కువైపోవడం లాంటి కంప్లైంట్లు ఉన్నప్పటికీ రచయితగా.. దర్శకుడిగా వెంకీ మంచి పనితనమే చూపించాడు.
చివరగా: సార్.. ఒక 'మంచి' సినిమా
రేటింగ్-2.75/5