Begin typing your search above and press return to search.

లిరిక‌ల్ భీష్మ: ఒంట‌రి బ‌తుకుపై ఆంథెమ్‌

By:  Tupaki Desk   |   27 Dec 2019 11:12 AM GMT
లిరిక‌ల్ భీష్మ: ఒంట‌రి బ‌తుకుపై ఆంథెమ్‌
X
ఒంట‌రి బ‌తుకు బాధ‌లు వ‌ర్ణనాతీతం. వ‌య‌సొచ్చాక ఆ బాధ‌ల్ని అస‌లే వ‌ర్ణించ‌లేం. వెంట ప‌డినంత మాత్రాన అమ్మాయి ప‌డుతుందా? అంటే చెప్ప‌లేం. అందువ‌ల్ల సింగిల్ గానే బ‌తుకు వెల్ల‌దీసే బ్ర‌హ్మ‌చారి బాబాయ్ ల‌ను చాలా మందినే చూస్తున్నాం ఈ సొసైటీలో. హై క్లాస్.. లోక్లాస్ .. మిడిల్ క్లాసు అంటూ ప్రొఫైల్స్ వెతికినా ఏదీ ఓకే కాదు. ఎంత ట్రై చేసినా త‌మ‌కో ఫిగ‌ర్ త‌గ‌ల్లేద‌ని చాలానే మ‌ద‌న ప‌డుతుంటారు. పార్క్ కి వెళ్లినా.. స్టేష‌న్ కి వెళ్లినా .. ఎక్క‌డికి వెళ్లినా జంట‌గా ఎవ‌రైనా కంట ప‌డితే అరే.. అంద‌రూ బాగానే ఉన్నారు.. నా బ‌తుకే ఎందుకిలా అయ్యింది! అన్న ఆవేద‌న సింగిల్స్ కి క‌లుగుతుంది.

పాపం నితిన్ లోని ఆ బాధ‌ల్నే తెర‌పైనా చూపిస్తున్న‌ట్టుగా ఉంది. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ గా నితిన్ అంటే మ‌గువ‌ల్లో ఎంతో ఇమేజ్ ఉంది. కానీ త‌న ప్రొఫైల్ కి త‌గ్గ పిల్ల దొర‌కాలి క‌దా! అది క‌ష్టమే అయ్యింది ఇన్నాళ్లు. అదంతా స‌రే కానీ... భీష్మ తొలి పోస్ట‌ర్ తోనే అస‌లు సంగ‌తిని రివీల్ చేసారు వెంకీ కుడుముల బృందం. ర‌ష్మిక వెంట‌ప‌డుతూ ఆ న‌డుము ఒంపును ట‌చ్ చేయాల‌నుకున్న కుర్రాడి కొంటెత‌నాన్ని ఆవిష్క‌రించారు. తాజాగా రిలీజ్ చేసిన లిరిక‌ల్ వీడియో `సింగిల్స్ ఆంథెమ్` లోనూ ఒంట‌రిత‌నం బాధ‌ల్ని సింగిల్స్ క‌ల‌త‌ల్ని ఆవిష్క‌రించారు లిరిసిస్ట్ శ్రీ‌మ‌ణి. ట్యూన్ అన‌వ‌స‌ర గ‌జిబిజి లేకుండా వాణి వినిపించేలా బాగానే కుదురుకుంది. మ‌హ‌తి సాగ‌ర్ ట్యూన్ అచ్చం చ‌క్రి ట్యూన్ ని గుర్తు చేసింది. అనురాగ్ కుల‌క‌ర్ణి గానం పెప్పీగా అల‌రించింది.

అన్న‌ట్టు..ఏప్రిల్ 15న నితిన్ వివాహం జ‌ర‌గ‌నుంద‌ని.. బ్యాచిల‌ర్ షిప్ వ‌దిలేస్తున్నాడ‌ట‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. మ‌రి ఇలా సింగిల్ బ‌తుకు వెత‌ల్ని తెర‌పైకి తెస్తే ఎలా! సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.