Begin typing your search above and press return to search.

జింద‌గీ.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ నుంచి సింగిల్

By:  Tupaki Desk   |   4 April 2021 4:30 PM GMT
జింద‌గీ.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ నుంచి సింగిల్
X
అక్కినేని అఖిల్ న‌టిస్తున్న తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`. పూజా హెగ్డే క‌థానాయిక‌. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌హ‌మ్మారీ వ‌ల్ల షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో సంక్రాంతి రిలీజ్ సాధ్య‌ప‌డ‌లేదు. ఇక ఈ వేస‌విలో మూవీని రిలీజ్ చేసేందుకు చిత్ర‌బృందం ప్ర‌య‌త్నాల్లో ఉంది.

ఇప్ప‌టికే ఈ మూవీ పోస్ట‌ర్లకు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. అఖిల్ - పూజా హెగ్డే జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ.. రొమాన్స్ వ‌ర్క‌వుటైంద‌ని సినిమాలో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా సీన్స్ హైలైట్ గా నిలుస్తాయ‌ని లీకులు వైర‌ల్ అయ్యాయి.

ఇక బ్యాచిల‌ర్ ప్ర‌మోష‌న్స్ ని పీక్స్ కి తీసుకెళ్లాల్సిన టైమ్ వ‌చ్చింద‌ని జీఏ2 సంస్థ భావిస్తోంది. ఈ సోమ‌వారం సాయంత్రం 5.04 గం.ల‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ నుంచి జిందగీ.. సింగిల్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ చిత్రానికి గోపి సుంద‌ర్ సంగీతం అందించారు. హ‌నియా న‌ఫీసా పెప్పీ గానం ఈ పాట‌లో మురిపించ‌నుంది. అఖిల్ - పూజా స్పోర్ట్ లుక్ తో ఉన్న పోస్ట‌ర్ ని రిలీజ్ చేయ‌గా ఆ పోస్ట‌ర్ కూడా ఆక‌ట్టుకుంటోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో పెప్పీ వాయిస్ ఆక‌ర్షిస్తోంది. హ్యాట్రిక్ ఫ్లాప్ ల త‌ర్వాత అఖిల్ క‌చ్ఛితంగా విజ‌యం సాధించాల్సిన స‌మ‌యమిది. భాస్క‌ర్-జీఏ 2 బృందం అత‌డికి ఒక బంప‌ర్ హిట్టు ఇస్తార‌నే భావిద్దాం.