Begin typing your search above and press return to search.

‘పుష్ప’టీజర్ లో సింగిల్ డైలాగ్.. అది అందరికీ తెలిసిందే!?

By:  Tupaki Desk   |   4 April 2021 5:30 PM GMT
‘పుష్ప’టీజర్ లో సింగిల్ డైలాగ్.. అది అందరికీ తెలిసిందే!?
X
స్టైలిష్ స్టార్ బ‌న్ని - క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. మంచి అంచనాలు క్రియేట్ చేస్తోంది. ‘ప్రీల్యూడ్ ఆఫ్ పుష్ప’ గ్లింప్స్ రూపంలో రిలీజ్ చేసిన వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, చిత్రాల్లో అల్లు అర్జున్ లుక్ ఎట్రాక్ట్ చేసింది. మొరటు వ్యక్తిగా కనిపించి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో ఫేస్ చూపించలేదు దుర్శకుడు. చేతులు తాళ్లతో వెనక్కి కట్టి ఉండగా.. ముఖానికి మాస్క్ వేసి ఉన్న బన్నీ.. అడవిలో చిరుత పులిలా పరిగెట్టాడు. ఈ స్మాల్ వీడియోకు.. డీఎస్పీ మోగించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కేక పెట్టింది.

దీంతో.. రాబోయే టీజ‌ర్ ఎలా ఉంటుందోన‌ని ఫ్యాన్స్ ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. బ‌న్నీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ నెల 7న టీజ‌ర్ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో.. ఈ టీజ‌ర్ ఎలా ఉండ‌బోతోంద‌ని డిస్క‌స్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

అయితే.. ఈ టీజ‌ర్ లో హీరో ఎలివేష‌న్ కే ప్ర‌యారిటీ ఇస్తున్నాడ‌ట ద‌ర్శ‌కుడు. కేవ‌లం ఒకే ఒక డైలాగ్ ఉంచి, యాక్ష‌న్ ప్యాక్డ్ టీజ‌ర్ ను క‌ట్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఆ డైలాగ్ ఏమంటే.. ఇటీవ‌ల ‘చావు క‌బురు చల్ల‌గా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పుష్ప గురించి ఫ్యాన్స్ అడగ్గా.. ‘తగేదే.. లే’ (తగ్గేదే లేదు) అని చిత్తూరు యాసలో ఓ డైలాగ్ చెప్పాడు. టీజర్లో ఇదే డైలాగ్ ఉంచబోతున్నట్టు ప్రచారం సాగుతోంది.