Begin typing your search above and press return to search.
నెలంతా పాడితే 750 ఇచ్చేవారు! గాయని ఉషా ఊతప్
By: Tupaki Desk | 17 April 2023 9:30 PM ISTనిండైన కట్టుబొట్టు.. విలక్షణ గాత్రం.. అబ్బురపరిచే హుషారుతో ఆలపించడం ప్రఖ్యాత గాయిన ఉషా ఉతప్ ప్రత్యేకత. ఆమె పాడుతుంటే వింటున్న వారి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ గాత్రంతో మైమరిచిపోయే తెలియకుండానే ఆ పాటకు తగ్గట్టు శరిరంలో కదలికలు మొదలవుతుంటాయి. ఆ గొంతులో ఏదో మ్యాజిక్ ఉందనిపిస్తుంది. ఆమె పాట ఉవ్వెత్తున ఎగసిపడే కెరటం.
విన్నవారెవరైనా ఎగరి గంతెయ్యా ల్సిందే. భారతీయ పాప్ గీతాలకు ఉషా ఉతుప్ ఓ చిరునామ. 'డిస్కోడ్యాన్సర్.. షాలిమార్ షాన్' వంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలు ఇప్పటికీ నాటి యువతనే కాదు.. ఈనాటి కుర్రకారునూ ఉర్రూతలూగిస్తాయి. తెలుగులో 'కీచురాళ్లు' చిత్రంలో ఆబమె పాడిన 'కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు... కీచురాళ్లు గొంతు చించుకున్న రేయికోళ్ళు'. ఈ ఒక్క పాటతోనే తెలుగులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదిం చుకున్నారు.
టాలీవుడ్ లో వేళ్ళమీద లెక్కపెట్టగలిగే పాటలే పాడినా ఆమె తెలియని సంగీత ప్రియులు ఉండరు. అయితే ఉషా ఊతప్ జీవితంలో ఆరంభంలో చాలా కష్టాలే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ ప్రారంభానికి ముందు ప్రయాణం గురించి రివీల్ చేసారు.
ప్రోఫెషనల్ సింగర్ కావడానికి ముందు ఉషా ఓ క్లబ్ సింగర్ గా జీవితం ప్రారంభించారు అన్నది ఎంత మందికి తెలుసు? ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. 'సినిమాల్లోకి రాక ముందు ఓ హోటల్ లో పాడేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్నాను. ఈ విషయంలో మా ఆంటీ ఒకరు సాయపడ్డారు. అప్పుడు నాకు 750 రూపాయలు వచ్చేవి. నెలంతా పాడినందుకు వచ్చిన పారితోషికం అది.
క్లబ్ లో నుంచుని పాడటం ఎంతో అద్భుతంగా అనిపించేది. ఆ రోజుల్లో అత్యధిక వేతనం పొందే నైట్ క్లబ్ సింగర్ నేనే. అప్పుడే దేవ్ ఆనంద్ ఓ రోజు నా పాట వినేందుకు ఢిల్లీలోని నైట్ క్లబ్ కి వచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత నా దగ్గరకు వచ్చి 'హరే రామ హరే కృష్ణ' ప్రాజెక్ట్ లో పనిచేస్తారా? అని అడిగారు.
ఆ సమావేశం నాకెంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే నా స్వరాన్ని...నేను పాడిన విధాన్ని ఆయన ఎంతో మెచ్చుకున్నారు. ఆ తర్వాత గ్రేట్ కంపోజర్లు అయిన ఆర్డీ బర్మన్.. బప్పీల హరి వంటి వారితో పనిచేశాను'అని తెలిపారు.