Begin typing your search above and press return to search.

శ్రీకాకుళంలో సునీతకు చేదు అనుభవం

By:  Tupaki Desk   |   7 Dec 2018 4:42 AM GMT
శ్రీకాకుళంలో సునీతకు చేదు అనుభవం
X
సింగర్‌ సునీత సినిమాల్లో మాత్రమే కాకుండా స్టేజ్‌ షోల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఈమద్య కాలంలో సినిమాల్లో కంటే ఈమె స్టేజ్‌ షోలకే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇక తాజాగా శ్రీకాకుళంలో గురువారం సాయంత్రం సింగర్‌ సునీత సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే పోలీసుల నుండి మొదటే ఆ కార్యక్రమానికి అనుమతి తీసుకోక పోవడంతో చివరి నిమిషంలో కార్యక్రమంను పోలీసులు ఆపేయడం జరిగింది.

ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగర వైఎస్‌ ఆర్‌ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సునీత పాటలు పాడేందుకు అక్కడకు వెళ్లారు. అయితే పోలీసు వారి నుండి అనుమతి తీసుకోవడంలో నిర్వాహకులు అలసత్వం ప్రదర్శించిన కారణంగా కార్యక్రమం క్యాన్సిల్‌ అయ్యింది. సాయంత్రం సమయంలో నిర్వాహకులు పోలీసుల పర్మీషన్‌ కు ప్రయత్నాలు చేశారు. ఎస్పీ నుండి అనుమతి వచ్చేప్పటికి రాత్రి 8 గంటలు అయ్యింది. అయితే అప్పటికే షో కు వచ్చిన జనాలు మరియు గెస్ట్‌ లు వెళ్లి పోయారు. అలా షో క్యాన్సిల్‌ అయ్యింది. శ్రీకాకుళం జనాలు సునీత పాటలు వినేందుకు ఎంతో ఆసక్తి చూపించినా నిర్వాహకుల వల్ల అది సాధ్యం కాలేదు. ఈ విషయమై సునీత కూడా నిర్వాహకులపై అసహనంను వ్యక్తం చేసినట్లుగా సమాచారం అందుతోంది.