Begin typing your search above and press return to search.

ఇప్పుడే కాదు ఎప్పటికి వెళ్లేది లేదంటున్న సింగర్‌ సునీత

By:  Tupaki Desk   |   4 Sep 2020 3:30 AM GMT
ఇప్పుడే కాదు ఎప్పటికి వెళ్లేది లేదంటున్న సింగర్‌ సునీత
X
తెలుగు బుల్లి తెర సెన్షేషనల్‌ షో బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ప్రారంభంకు రంగం సిద్దం అయ్యింది. మరో రెండు రోజుల్లో షో ప్రారంభం కాబోతుంది. ఈ షోలో సింగర్‌ జాబితాలో సునీత ఉండబోతుందని మొదటి నుండి ప్రచారం జరుగుతోంది. గత నెల రోజులుగా సింగర్‌ సునీత బిగ్‌ బాస్‌ లో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఇక ఇటీవల సునీత షో లో జాయిన్‌ అవ్వడం కోసం స్టార్‌ మా వారు క్వారెంటైన్‌ లో ఉంచారనే ప్రచారం కూడా జరిగింది. దాంతో ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. ఇకపై అయినా వాటికి బ్రేక్‌ వేయాలనే ఉద్దేశ్యంతో సింగర్‌ సునీత ఫేస్‌ బుక్‌ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

బిగ్‌ బాస్‌ లో తాను పాల్గొనబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు. అసలు ఈ సీజన్‌ లోనే కాదు నేను ఎప్పటికి ఏ సీజన్‌ లో కూడా భాగం కాబోను అంటూ పేర్కొంది. నా మనస్థత్వంకు బిగ్‌ బాస్‌ షో ఫార్మెట్‌ కు పూర్తి విభిన్నం అంటూ సింగర్‌ సునీత క్లారిటీ ఇచ్చింది. సింగర్‌ గానే కాకుండా బుల్లి తెరపై ఆమెను చూడాలని చాలా మంది అనుకున్నారు. వెండి తెరపై నటిగా కూడా ఆమెను చూడాలని అభిమానులు కోరుకున్నారు. కాని రెండు కోర్కెలు తీరే అవకాశం లేదని దాదాపుగా సునీత క్లారిటీ ఇచ్చేసింది. బిగ్‌ బాస్‌ లో ఎవరు కంటెస్టెంట్స్‌ అనే విషయంలో ఈనెల 6వ తారీకు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం కాబోతున్న షో తో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.