Begin typing your search above and press return to search.

వైరల్ గా సింగర్ సునీత స్పెషల్ వీడియో..

By:  Tupaki Desk   |   10 Jan 2022 4:41 AM GMT
వైరల్ గా సింగర్ సునీత స్పెషల్ వీడియో..
X
తెలుగునాట సింగర్లు ఎంతో మంది ఉన్నా.. సునీత అందుకు భిన్నం. తేనె లాంటి ఆమె స్వరం చేసే మేజిక్ కు కోట్లాది మంది ఫిదా అవుతుంటారు. ఆమె స్వరంతోనే కాదు.. ఆమె సంభాషణలు తెలుగువారిని ఎంతలా కట్టి పారేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలిన సింగర్లకు భిన్నంగా ఆమె జీవితం ఉంటుంది.అయితే.. ఏదీ దాచి పెట్టుకోకుండా.. అన్నింటిని షేర్ చేసుకునే విషయంలో సునీత మిగిలిన సెలబ్రిటీలకు భిన్నమని చెప్పాలి. తన బాధను.. సంతోషాన్ని సమంగా పంచుకున్న ఆమె.. తాజాగా తన రెండో పెళ్లి మొదటి ఏడాది జర్నీని తన అభిమానుల కోసం షేర్ చేసింది.

ప్రతి పెళ్లికి ఒక స్టోరీ ఉంటుందని.. అదెప్పటికీ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని చెప్పే సింగర్ సునీత.. గత ఏడాది తన రెండో పెళ్లిని బిజినెస్ మ్యాన్ రామ్ తో జరగటం తెలిసిందే. అప్పట్లో ఆమె పెళ్లి ఒక సంచలనంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆమె రెండో పెళ్లి తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పది నిమిషాల నిడివి ఉన్న ఒక వీడియోను షేర్ చేసింది.

వెడ్డింగ్ మెమరీస్ పేరుతో ఉన్న ఈ వీడియోలో వివాహ వేడుక జ్ఞాపకాలను కళ్లకు కట్టేలా వీడియోలో చూపించారు. దీంతోపాటు.. తన కుటుంబ సభ్యుల అభిప్రాయాల్ని జత కావటం.. ఈ వీడియోకు నిండుతనంగా మారింది. ఈ వీడియోలో తన గురించి.. తమ వివాహం గురించి..ఇరు కుటుంబాలకు చెందిన వారి అభిప్రాయాలు ఉన్నాయి. తన భర్త రామ్ గురించి సునీత చెబుతూ.. మంచి కాఫీ లాంటి అబ్బాయ్ అంటూ ముసిముసి నవ్వుల మధ్య చెప్పిన వైనం అందరిని అట్రాక్టు చేసేలా ఉంది.

ఇక.. సునీత తల్లితన కుమార్తె గురించి చెబుతూ.. బరువు.. బాధ్యతలన్నీ తీర్చుకుంటూ.. ఎప్పుడూ చిరునవ్వుతో.. అన్ని సహనంతో చేసుకుంటూ ముందుకు వెళ్లింది. తనది డేరింగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ అని పేర్కొంది. ఇక.. సునీత తండ్రి మాట్లాడుతూ.. తమ కుటుంబానికి పెద్ద కొడుకులా వ్యవహరించిందని.. తన జీవితంలో ఎన్నో అటుపోట్లను ఎదుర్కొందని పేర్కొన్నారు. తన భర్త రామ్ గురించి సునీత మాట్లాడుతూ.. ‘ఎనిమిదేళ్లుగా తెలుసు. చాలా నిజాయితీపరుడు. ఏదైనా ముఖంపైనే చెప్పే వ్యక్తిత్వం తనది’ అని చెప్పింది.

పెళ్లి తర్వాత తన జీవితం చాలా బ్యూటిఫుల్ గా సాగుతుందని పేర్కొంది. నిజమే.. ఆ విషయం సునీత మాటల్ని చూసి.. కాదు ఆమెను చూస్తేనే అర్థమవుతుంది. ఇటీవల ఆమె ఒళ్లు చేసిన వైనం.. వీడియోలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. గుండెల్లో.. మనసులో ఆనందం ఉప్పొంగుతున్న వేళ.. కాసింత బరువు చేయటం తప్పేం కాదు.

ఈ వీడియోను పోస్టు చేసినంతనే.. పెద్ద ఎత్తున వైరల్ కావటం విశేషం. గంటల వ్యవధిలోనే ఏడున్నర లక్షల వ్యూస్ ను సాధించిన ఈ వీడియో మిలియన్ వ్యూస్ దగ్గరకు వెళ్లిపోయింది. ఏమైనా.. తన పెళ్లి మొదటి వార్షికోత్సవం వేళ.. తనను అభిమానించే వారి కోసం విడుదల చేసిన స్పెషల్ వీడియో క్యూట్ గా ఉందని చెప్పక తప్పదు.