Begin typing your search above and press return to search.

పెళ్లయ్యాక సింగర్ సునీత ఫస్ట్ పోస్ట్.. త్వరలో హనీమూన్!

By:  Tupaki Desk   |   20 Jan 2021 9:30 AM GMT
పెళ్లయ్యాక సింగర్ సునీత ఫస్ట్ పోస్ట్.. త్వరలో హనీమూన్!
X
టాలీవుడ్ పాపులర్ సింగర్ సునీత ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుండో రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో పుకార్లు చక్కర్లు కొడుతూ వచ్చాయి. అవి పుకార్లు కాదు నిజమే అని నిరూపించింది సునీత. అంతా ఆశ్చర్యపోయే లోపల నిశ్చితార్థం జరిగిందని సడన్ షాక్ ఇచ్చింది. అంతేగాక ఆమె ఎంగేజిమెంట్ కి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

తాజాగా సునీత మరోసారి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. చాలకాలం తర్వాత సునీత సోషల్ మీడియాలో కనిపించడంతో సోషల్ మీడియా యూజర్లు ఏం పోస్ట్ చేసిందో అంటూ ఎగబడి చూస్తున్నారు. అయితే ఆమె సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్న ఫోటో షేర్ చేసింది సునీత. అలాగే హ్యాపీ కాఫీ టైం అంటూ ట్యాగ్ లైన్ కూడా జోడించింది. ఇక సునీత తన పెళ్లి హడావిడి నుండి ఇంకా తేరుకున్నట్లు లేదు. సన్నిహితులతో పార్టీలు, భర్తతో పూజలు ఇలా ఫుల్ బిజీగా గడుపుతుందట.

పెళ్ళికి ముందు సునీత సోషల్ మీడియాలో ఎంత అలెర్ట్ గా ఉండేదో ఇప్పుడు పెళ్లి తర్వాత ఆ తీరిక లేనట్లుంది. కానీ పెళ్ళికి ముందుకంటే పెళ్లి తర్వాతనే ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది సునీత. వేక్డ్ ఔట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రామ్ వీరపనేనిని ఇష్టపడి ఇటీవలే సునీత వివాహం చేసుకుంది. అదిగాక తన పిల్లల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని, రామ్ చాలా మంచివారు.. ఆయనతో తన మిగిలిన జీవితాన్ని పంచుకోబోతున్నానని తెలిపింది.

అయితే సునీత కంటే భర్త రామ్ ఐదేళ్లు వయసులో పెద్ద. రామ్ వయసు ప్రస్తుతం 47 కాగా.. సునీత వయసు 42. ఇద్దరి జోడి అదిరిందని ఇప్పటికే విషెస్ పొందుతున్నారు ఈ కొత్త దంపతులు. ఇక త్వరలోనే సునీత, రామ్ హనీమూన్ కి వెళ్ళబోతున్నారట. మొత్తానికి వివాహ జీవితాన్ని మరోసారి సునీత ఎంజాయ్ చేస్తుందంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.