Begin typing your search above and press return to search.

రేవంత్ కి నాగ్ ఎల్లో కార్డ్.. శ్రీహాన్ కి తగిలిన గీతు షాక్..!

By:  Tupaki Desk   |   6 Nov 2022 9:30 AM GMT
రేవంత్ కి నాగ్ ఎల్లో కార్డ్.. శ్రీహాన్ కి తగిలిన గీతు షాక్..!
X
బిగ్ బాస్ సీజన్ 6 లో ఉన్న వారిలో కాస్త కూస్తో టైటిల్ రేసులో ఉన్న ఇద్దరి హౌస్ మెంట్స్ కి హోస్ట్ నాగార్జున షాక్ ఇచ్చారు. శనివారం ఎపిసోడ్ లో రేవంత్ కి ఎల్లో కార్డ్ ఇచ్చారు నాగార్జున. రేవంత్ ఆట తీరు బాగున్నా ఆటలో అతని ఆవేశం వల్ల హౌస్ మెట్స్ ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్ గా జరిగిన బ్యాటిల్స్ టాస్క్ లో.. ఇనయాని చేత్తో దారుణంగా కిందకు నెట్టేస్తాడు రేవంత్. అది వీడియో చూపించి మరి రేవంత్ కి మరోసారి వార్నింగ్ ఇచ్చాడు నాగ్. లాస్ట్ వీకే తను ఒక ఉన్మాదిగా ఆడుతున్నాడని నాగ్ చెప్పారు. నాగార్జున వార్న్ చేసినా సరే రేవంత్ ఆట ఆడుతున్న టైం లో తన కంట్రోల్ తప్పుతున్నాడు.

అందుకే రేవంత్ కి గుర్తుండిపోయేలా అతనికి ఎల్లో కార్డ్ ఇచ్చాడు నాగార్జున. ఆటలో ఎల్లో కార్డ్ వార్నింగ్ అని.. రెడ్ కార్డ్ తెచ్చుకోవద్దని చెప్పారు హోస్ట్ నాగార్జున. టైటిల్ రేసులో ఉన్న రేవంత్ ఆటపై నాగార్జున కామెంట్ మిగతా హౌస్ మెట్స్ ని సపోర్ట్ చేసే వారికి బలాన్నిచ్చిందని చెప్పొచ్చు. ఇక మరోపక్క లాస్ట్ వీక్ కెప్టెన్ గా శ్రీహాన్ వరస్ట్ అనేశారు నాగార్జున. కెప్టెన్ గా తన బాధ్యతలను సరిగా నిర్వర్తించలేదని అన్నారు. శ్రీహాన్ కి కూడా ఒక వీడియో చూపించారు నాగ్. లాస్ట్ వీక్ సంచాలక్ గా ఫెయిల్ అయినందుకు హోస్ట్ నాగార్జున గీతుకి వాష్ రూమ్ క్లీనింగ్ ఇచ్చారు. అది తను ఒక్కతే చేయాలని చెప్పగా.. ఆదిరెడ్డితో వాష్ రూమ్ క్లీనింగ్ చేయించింది గీతు. శ్రీహాన్ అక్కడకి వెళ్లి చూసినా గీతుని ఏమీ అనకుండా వీకెండ్ నాగ్ సర్ ఏమన్నా అంటే నరికేస్తా అని అన్నాడు. ఆ వీడియో చూపించి మరి శ్రీహాన్ గీతుని నరుకుతావా అని అడిగారు.

గీతు వల్ల శ్రీహాన్ కి కూడా పనిష్ మెంట్ ఇచ్చారు నాగ్. నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ గా శ్రీహాన్ ని అనర్హుడిని చేశారు. ఇలా హౌస్ లో స్ట్రాంగ్ అనుకున్న రేవంత్, శ్రీహాన్ లకు పెద్ద షాక్ ఇచ్చాడు నాగార్జున. ఆట ఆడటం వరకు ఓకే కానీ ఇలా ఒకరిని ఇబ్బంది పెట్టకూడదని అన్నారు. ఇక హౌస్ లో ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేస్తూ నానా రచ్చ చేస్తున్న ఇనయాని కూడా నాగ్ వార్న్ చేశారు. కమ్యునికేషన్ లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని.. అంతా కమ్యునికేట్ చేసుకోండని నాగ్ చెప్పారు.

వీక్ మొత్తం ఎలా ఉన్నా సరే వీకెండ్ లో నాగార్జున ఎపిసోడ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది. నాగార్జున కూడా ఇదివరకు బిగ్ బాస్ టీం ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివేవారు అన్న టాక్ ఉండేది. కానీ ఇప్పుడు ఆయన కూడా షో చూస్తున్నట్టు ఉన్నారు అనిపించేలా నాగార్జున అదరగొట్టేస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని మిస్ అవ్వకుండా ఆడియన్స్ ని అడిగి కడిగి పారేస్తున్నారు. హోస్ట్ గా నాగార్జునకి 100కి 100 మార్కులు ఇచ్చేయొచ్చు.