Begin typing your search above and press return to search.
ఆ సింగర్ డాక్టర్‌ను ఎందుకు కొట్టాడు?
By: Tupaki Desk | 14 April 2015 2:24 PM ISTఅదుర్స్ సినిమాలో పిల్లా నా వల్ల కాదు.. మిర్చి సినిమాలో యాహూ యాహూ పాటలు వింటే ఇదేదో చాలా టిపికల్ వాయిస్‌లా ఉందే అనిపిస్తుంది. ఆ సింగర్ పేరు మికా సింగ్. బాలీవుడ్‌లో బాగా పాపులర్. లెజెండరీ సింగర్ దలేర్ మెహందీకి తమ్ముడే ఈ మికా. బాలీవుడ్‌లో పాటకు పది లక్షలు పారితోషకం తీసుకునే సింగర్‌గా గొప్ప పేరే ఉందీ కుర్రాడికి. ఈ సింగర్ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఢిల్లీలో నిర్వహించిన ఓ మ్యూజికల్ షోలో వేదిక మీద ఓ డాక్టర్ చెంప చెల్లుమనిపించడం సంచలనం రేపుతోంది. ఆ విజువల్స్ కూడా రికార్డవడంతో మనోడు అడ్డంగా బుక్కయిపోయాడు.
తనతో కలిసి స్టెప్పులేస్తూ పాట పాడేందుకు ఆడియన్స్‌లో ఉన్న తనను మికా పిలిచాడని.. స్టేజ్ మీద అతను చెప్పినట్లు చేయనందుకు తనను కొట్టాడని, ఆ తర్వాత అతడి బౌన్సర్లు తనను చితకబాదాడని శ్రీకాంత్ అనే ఆ డాక్టర్ కేసు పెట్టాడు. ఐతే మికా వెర్షన్ మరోలా ఉంది. ఆ డాక్టర్ కింద అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం.. ఆడియన్స్‌తో న్యూసెస్స్ చేస్తుండటం చూశానని.. అందుకే వేదిక మీదికి పిలిచి వార్నింగ్ ఇచ్చానని.. కానీ అతడి తిక్కతిక్కగా మాట్లాడటంతో కోపంలో చెంపదెబ్బ కొట్టానని చెబుతున్నాడు. కానీ ఇద్దరిలో ఎవరు చెబుతోంది నిజమో, ఎవరు కట్టుకథ చెబుతున్నారో అర్థం కావడం లేదు. ఈ సంగతి పోలీసులే తేల్చాలి.