Begin typing your search above and press return to search.
ప్రముఖ సింగర్ ను బ్యాన్ చేశారు
By: Tupaki Desk | 14 Aug 2019 11:26 AM ISTసామాన్యుల సంగతి పక్కన పెడితే.. ప్రముఖులుగా.. సెలబ్రిటీలుగా ఉన్న వారు వేసే ప్రతి అడుగు ఆచితూచి అన్నట్లుగా ఉండాలి. అందులోకి కోట్లాది మంది సెంటిమెంట్లు గాయపరిచే ప్రయత్నం అస్సలు చేయకూడదు. ఆర్థిక ప్రయోజనం తప్పించి.. మిగిలిన వాటిని పట్టించుకోనప్పుడు ఎంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయన్న విషయాన్ని తెలిపే వైనం తాజగా చోటు చేసుకుంది. గడిచిన కొద్ది రోజులుగా దాయాదికి మనకు మధ్య నడుస్తున్న పంచాయితీలు తెలిసిందే.
దేశ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్న పాక్ ప్రభుత్వ తీరుతో భారత్ సర్కారుతో పాటు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటివేళలో పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న ప్రముఖ సింగర్ మికా సింగ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరాచీలో షో చేసిన ఆయనపై తాజాగా బ్యాన్ చేస్తూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.
పాక్ మాజీ అధ్యక్షుడు ముష్రాఫ్ బంధువు ఇంట్లో జరిగిన వేడుకలో ప్రత్యేక కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు మికా సింగ్. ఆయన షోపై ఆటు పాక్ లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న వేళ.. పాక్ కు వెళ్లి షో నిర్వహించటాన్ని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ తప్పు పట్టింది.
ఈ నేపథ్యంలో మికా సింగ్ పై బ్యాన్ వేటు వేసింది. దీంతో.. అతనితో పని చేసేందుకు ఒప్పందం చేసుకున్న అన్ని సినీ నిర్మాణ సంస్థలు.. మ్యూజిక్ కంపెనీలు అతన్ని బహిష్కరించాలని డిసైడ్ అయ్యాయి. మికా సింగ్ తో కలిసి భారత్ లో ఎవరూ పని చేయకూడదని నిర్ణయించారు. ఒకవేళ తమ నిర్ణయాన్ని కాదని మికాతో పని చేసిన వారిపై చర్యలు తప్పవని అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ శ్యాంలాల్ గుప్తా తేల్చారు. దాయాదితో సంబంధాలు సరిగా లేకుండా.. ఉద్రిక్త పరిస్థితుల వేళ అక్కడకు వెళ్లి షోను నిర్వహిచటం తప్పన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తనపై బ్యాన్ వేటు పడిన నేపథ్యంలో మికా సింగ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.