Begin typing your search above and press return to search.

దాడిపై రియాక్ట్ అయిన సింగర్ మంగ్లీ

By:  Tupaki Desk   |   23 Jan 2023 10:08 AM GMT
దాడిపై రియాక్ట్ అయిన సింగర్ మంగ్లీ
X
టాలీవుడ్ లో స్టార్ సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్న నేపధ్య గాయని మంగ్లీ. ఆమె ఎనర్జిటిక్ స్వరంతో తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ ఉంది. ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ కూడా తమ సినిమాలలో మంగ్లీ సాంగ్ ఒకటైనా ఉండాలి అనే విధంగా ఆమె తన ఇమేజ్ ని పెంచుకుంది. ఒక వైపు సినిమాలకి సాంగ్స్ పాడుతూనే సొంతగా ఆల్బమ్స్ కూడా చేస్తుంది. మంగ్లీ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కి కూడా యుట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తూ ఉంటాయి.

ఒకప్పటి జానపదాలని ఆధునిక సంగీతం జోడించి మళ్ళీ వాటికి మంగ్లీ జీవం పోస్తుంది. ఇక తెలుగులో మంగ్లీ పాటలకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కర్ణాటకలో కూడా అంతే స్థాయిలో ఉంది. పుష్ప ఊ అంటావా సాంగ్ ని కన్నడంలో మంగ్లీ పాడిన సంగతి అందరికి తెలిసిందే. ఆ సాంగ్ కన్నడనాట బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాని తర్వాత కూడా కన్నడ సినిమాలలో మంచి పాటలు పాడుతూ ఉంది. ఒక గాయనిగా సినిమాలు, ఆల్బమ్స్ చేస్తూనే ఈవెంట్స్ లో కూడా ఆమె పార్టిసిపేట్ చేస్తుంది.

ఎక్కడ పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగిన కూడా అందులో సింగర్ మంగ్లీ పాట వినిపిస్తుంది. సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహించి శివరాత్రి ఈవెంట్ లో రెండు సార్లు ఆమెకి పాడే అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే తాజగా కర్ణాటకలో బళ్ళారి సమీపంలో సింగర్ మంగ్లీ కారుపై రాళ్ళదాడి జరిగినట్లు కథనాలు వచ్చాయి.

కొంతమంది ఆమెని లక్ష్యంగా చేసుకొని బళ్ళారి ఉత్సవ్ ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో రాళ్ళతో దాడి చేసారని వార్తలు వచ్చాయి.

ఇక ఆ దాడి చేసింది వారే అయ్యి ఉంటారని రెండు సంఘటనలు కూడా చూపించారు. అయితే ఈ వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. తమపై ఎలాంటి దాడి జరగలేదని, మీడియాలో వస్తున్నవన్ని కూడా తప్పుడు కథనాలు అని కొట్టి పారేసింది.

తాను పాల్గోన్నవాటిలో బళ్ళారిలో జరిగింది బెస్ట్ ఈవెంట్ అని, తనకి అపూర్వ స్వాగతం అక్కడ లభించింది అని పేర్కొంది. తనకి గొప్పగా అక్కడి ప్రజలు ఆదరించారని, అద్బుతంగా ఈవెంట్ ముగిసింది అని తెలిపింది. తనపై ఎలాంటి దాడి జరగలేదని, తన ప్రతిష్టకి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఈ తప్పుడు వార్తలు ప్రచారం చేసారంటూ నోట్ రిలీజ్ చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.