Begin typing your search above and press return to search.
నేను బతికే ఉన్నా.. ఇంట్లోనే ఉన్నా
By: Tupaki Desk | 7 May 2021 9:00 AM ISTకరోనా కారణంగా ఎంతో మంది ప్రముఖులు మృతి చెందారు. మరి కొందరు ప్రముఖులు కరోనా తో పోరాటం చేసి బయట పడ్డారు. ఈ క్రమంలో కొందరు ప్రముఖులు మృతి చెందక ముందే మృతి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్ స్టార్ సింగర్ లక్కీ అలీ కరోనాతో మృతి చెందినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన మృతి వార్తలతో అభిమానులు తీవ్ర మనోవేదనకు గురి అయ్యారు. ఆయనకు కొందరు సినీ ప్రముఖులు కూడా శ్రద్దాంజలి ఘటిస్తూ పోస్ట్ లు పెట్టడం జరిగింది. కాని అసలు విషయం ఏంటీ అంటే ఆయన మృతి చెందలేదు. అవి కేవలం పుకార్లే. తన గురించి వస్తున్న పుకార్లకు లక్కీ అలీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు.
లక్కీ అలీ సోషల్ మీడియాలో... హాయ్ ఎవ్రీవన్ నాపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. నేను బతికే ఉన్నాను. హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాను. నేను ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాను తప్ప మరెక్కడికి వెళ్లలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. మీరు అంతా కూడా సేఫ్ గా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ విపత్కర సమయంలో దేవుడు మన అందరిని కూడా కాపాడుతాడని ఆశిద్దాం అంటూ పేర్కొన్నాడు. లక్కీ అలీ ఆరోగ్యం విషయమై ఇప్పటికే ఆయన సన్నిహితులు కొందరు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అలీ సేఫ్ గా ఉన్నారు.. ఆయన గురించి ఆందోళన అక్కర్లేదు అంటూ పేర్కొన్నారు. తాజాగా అలీ స్వయంగా పేర్కొనడంతో పుకార్లకు చెక్ పడ్డట్లు అయ్యింది.