Begin typing your search above and press return to search.

హీరోయిన్ ని పెళ్లాడుతున్న నేప‌థ్య‌గాయ‌కుడు?

By:  Tupaki Desk   |   15 March 2022 3:30 AM GMT
హీరోయిన్ ని పెళ్లాడుతున్న నేప‌థ్య‌గాయ‌కుడు?
X
సింగర్ జుబిన్ నౌటియాల్ పాపులారిటీ గురించి తెలిసిన‌దే. అత‌డు ప్ర‌ముఖ నటి నికితా దత్తాతో స‌న్నిహితంగా ఉంటున్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది. త్వ‌ర‌లోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ బాలీవుడ్ మీడియా జోరుగా క‌థ‌నాల్ని వండి వారుస్తోంది.

గాయకుడు జుబిన్ నౌటియాల్ - నటి నికితా దత్తా పెళ్లితో ఓ ఇంటి వార‌య్యే ఛాన్సుంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. వారి తల్లిదండ్రులు ఇటీవల జుబిన్ స్వస్థలమైన ఉత్తరాఖండ్ లో ఒకరినొకరు కలుసుకున్నారని టాక్ వినిపించిన‌ తర్వాత ఇద్దరూ తమ పెళ్లి పుకార్లతో వినోద పరిశ్రమలో ప్ర‌కంప‌నాలు సృష్టించారు.

ఇంత‌కుముందు అత‌డు నికితా నివాసం ఉండే ముంబై ఇంటికి కూడా వెళ్ల‌డంతో రక‌ర‌కాల క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. నికితా- జుబిన్ అనేక సందర్భాల్లో కలిసి కనిపించారు. ఈ జోడీ విహారయాత్రలు వారి సంబంధం గురించి ప్రతి ఒక్కరికీ ఆసక్తిని కలిగించాయి.

ఈ జంట ఇటీవల జుహులోని ఒక కేఫ్ లో హ్యాంగ‌వుట్ చేసిన‌ట్టు పుకార్లు వచ్చిన తర్వాత ఇద్ద‌రి న‌డుమా ప్రేమాయ‌ణంపై ఊహాగానాలు మళ్లీ ముఖ్యాంశాలుగా మారాయి. నికితా ఇటీవల డెహ్రాడూన్ నుండి జుబిన్ తో క‌లిసి ఉన్న ఒక చిత్రాన్ని పోస్ట్ చేయ‌గా అది హాట్ టాపిక్ అయ్యింది.

జుబిన్ పర్వతాల వీక్షణను ఆస్వాధిస్తూ కెమెరా వైపు తన వీపుతో కనిపించ‌గా... నికితా దీనికి ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ఇచ్చింది. నేను పర్వతాలలో నా ఆత్మను కాసేపు వదిలిపెట్టాను.. అని వ్యాఖ్య‌ను జోడించింది. ఆ వ్యాఖ్య‌ అందరి దృష్టిని ఆకర్షించింది. జుబిన్ తన పోస్ట్ పై `ఇక్కడ మీ హృదయాన్ని కూడా మరచిపోలేదా?` అని వ్యాఖ్యను జోడించారు.

వారి రెండు సందేశాలలోని హార్ట్ ఎమోజీలను పరస్పరం షేర్ చేసుకోవ‌డం చూస్తుంటే ఒక‌రిపై ఒక‌రికి ప్రత్యేక ఆరాధనా భావం వ్య‌క్త‌మైంది. అయితే ఈ దాగుడు మూత‌లాట‌కు చెక్ పెడుతూ ఏదైనా అధికారికంగా వెల్ల‌డిస్తే బావుంటుంద‌నేది అభిమానుల సూచ‌న‌.

త‌మ ప్రేమాయ‌ణంపై తాజాగా సింగర్ జుబిన్‌ నౌటియాల్ స్పందించాడు. ఈ విషయంపై మేము చెవిటి వాళ్లలా మౌనంగా ఉన్నాం. ఏక్ దుజే కే వాస్తే టీవీ షో నుంచి నికితా నాకు స్నేహితురాలు. ఆ కార్యక్రమంలో నేను ఒక పాట పాడాను. అప్పటినుంచే ఒకరికొకరం తెలుసు. చాలాకాలంగా నేను నికితా జుహు కేఫ్ కు వెళ్తూ మాట్లాడుకునేవాళ్లం.

మేము డేటింగ్‌ చేస్తున్నామా.. లేదా ? అనే విషయం నాకు చెప్పాలని లేదు. ఎందుకంటే.. ఏం చెబితే అది ఎటువైపు దారితీస్తుందో చెప్పలేం. అందరి దృష్టి మాపై ఉన్న‌ప్పుడు ఇబ్బందుల్లో ప‌డ‌డం ఇష్టం లేదు.. అని వ్యాఖ్యానించాడని క‌థ‌నాలొస్తున్నాయి.