Begin typing your search above and press return to search.

ఆయన మాటలతో ఆయనకే కౌంటర్‌ ఇచ్చింది

By:  Tupaki Desk   |   22 Jan 2020 10:48 AM IST
ఆయన మాటలతో ఆయనకే కౌంటర్‌ ఇచ్చింది
X
తమిళ లెజెండ్రీ రచయిత వైరముత్తుపై సింగన్‌ చిన్మయి గత ఏడాది సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. 20 ఏళ్ల క్రితం తనను వైరముత్తు లైంగికంగా వేదించాడని.. తనను ఆఫర్‌ ఆశ చూపించి లోబర్చుకునే ప్రయత్నం చేశాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. చిన్మయి వ్యాఖ్యలను కొందరు కొట్టి పారేయగా కొందరు ఆమెను సమర్ధించారు. ఇక ఈ విషయమై న్యాయ పోరాటం కూడా సాగుతున్న విషయం తెల్సిందే.

ఈ సమయంలోనే వైరముత్తు ఒక కార్యక్రమం లో పాల్గొని మద్యపానం వల్ల కలిగే నష్టాలపై స్పీచ్‌ ఇచ్చాడు. మద్యపానం తీసుకోవడం వల్ల పురుషులు విచక్షణ కోల్పోతున్నారు. దాంతో వారిలో రాక్షసుడు మేలుకుని ఆడవారి పై అఘాయిత్యం కు పాల్పడుతున్నారు. అందుకే మద్యపానం నిషేదించాల్సిందిగా ఆయన కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తమిళనాడులో మద్యపానం నిషేదించడం వల్ల ఆడవారి పై జరుగుతున్న లైంగిక దాడులను అడ్డుకోవచ్చు అంటూ ఆయన సలహా ఇచ్చాడు.

వైరముత్తు ఆ కార్యక్రమంలో మాట్లాడిన వీడియోను ఒక వ్యక్తి చిన్మయిని ట్యాగ్‌ చేసి ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశాడు. ఆ వీడియో ను చూసి స్పందించిన చిన్మయి తనదైన శైలిలో వైరముత్తు కు కౌంటర్‌ ఇచ్చింది. 20 సంవత్సరాల క్రితం మీరు అన్నట్లుగా మద్యపానం బ్యాన్‌ చేసి ఉంటే నాపై మీరు అప్పట్లో లైంగిక వేదింపులకు పాల్పడేవారు కాదు కదా అంటూ ప్రశ్నించింది. అప్పట్లో మద్యపానం బ్యాన్‌ ఉంటే వైరముత్తు నుండి నేను లైంగిక వేదింపులను తప్పించుకునేదాన్ని అంటూ ఆయన వీడియో కు కౌంటర్‌ ఇచ్చింది.