Begin typing your search above and press return to search.
దర్శక దిగ్గజం సింగీతంకు కరోనా
By: Tupaki Desk | 16 Sept 2020 4:20 PM ISTసినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. కొంచెం వయసు ఎక్కువగా ఉన్న వాళ్లకు వైరస్ ప్రభావం మరీ అధికంగా ఉంది. ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు ముందుగా మైల్డ్ కరోనా సోకిన ప్పటికీ ఆ తర్వాత పరిస్థితి తీవ్రంగా విషమించింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావుకి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇటీవల కొంచెం అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకున్నానని.. పరీక్షల్లో పాజిటివ్ తేలిందని చెప్పారు.
'నేను ఇప్పుడేంటి అరవై, డెబ్భై సంవత్సరాలుగా పాజిటివ్ నే ' అంటూ కరోనాను సైతం ఆయన తేలిగ్గా తీసుకున్నారు. వైద్యులు కరోనా సోకిందని చెప్పినప్పటినుంచి హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటున్నానని, ఈ నెల 23వ తేదీ వరకు ఐసోలేషన్ లోనే ఉంటానని చెప్పారు. దీని పై అభిమానులు, సన్నిహితులు ఎవరు కంగారు పడొద్దని, తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, తొందర్లోనే పూర్తిగా కోలుకుంటానని సింగీతం శ్రీనివాసరావు తెలిపారు.
ప్రస్తుతం సింగీతం ఓ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ కథ సమంతా కోసం సిద్ధం చేస్తున్నారని ప్రచారంలో ఉంది. నందమూరి బాలకృష్ణ తో సింగీతం శ్రీనివాసరావు తీసిన ఆదిత్య 369 సినిమా ఎంత క్లాసికల్ హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు కూడా సీక్వెల్ తీసేందుకు సింగీతం ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతవరకు వస్తుందో చూడాలి మరి.