Begin typing your search above and press return to search.

పోలీసులపై సినిమాలు తీసి తప్పు చేశా..

By:  Tupaki Desk   |   29 Jun 2020 9:30 AM GMT
పోలీసులపై సినిమాలు తీసి తప్పు చేశా..
X
పోలీసులను హీరోగా చూపించిన దర్శకులు చాలా మంది ఉన్నారు. కానీ సామి, సింగం పేరిట మూడు మూడు సిరీస్ లు చేసి పోలీసులను సూపర్ హీరోలను చేశాడు తమిళ దర్శకుడు హరి. కానీ తాజాగా తమిళనాట చోటుచేసుకున్న ఒక దారుణంతో తాను పోలీసులపై అన్ని సినిమాలు తీయడం తప్పైందని సంచలన వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

తమిళనాడులోని తుత్తుకొడి జిల్లాలో సతాన్యులం పట్టణంలో జయరాజ్, ఫెనిక్స్ అనే తండ్రీకొడుకులు పోలీస్ కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ దారుణం తమిళనాట తీవ్ర కలకలం రేపింది. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై సినీ సెలెబ్రెటీలు రజినీకాంత్, ఖుష్బూ కూడా స్పందించారు. పోలీసుల తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించి విచారణకు ఆదేశించినట్టు తెలిసింది.

ఈ నేపథ్యం లోనే తమిళం లో పోలీసులను బాగా హైలెట్ చేస్తూ సినిమాలు తీసిన దర్శకుడు హరి తాజా గా స్పందించారు. తమిళ నాట పోలీసుల దురాగతం నేపథ్యం లో పోలీసులను హీరోలు గా చూపించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్టు హరి అన్నట్టు వార్తలు వెలువడ్డాయి. పోలీసులు మరీ అంత గొప్ప వాళ్లు కాదని.. పోలీసులపై సినిమాలు తీసి తప్పు చేశానని హరి ఈ ఘటనను బట్టి అభిప్రాయపడ్డట్టు తెలిసింది.