Begin typing your search above and press return to search.

'సర్దార్‌' కు అక్కడ ఇక్కడ ఆమె ప్లస్‌

By:  Tupaki Desk   |   27 Jun 2021 2:30 PM GMT
సర్దార్‌ కు అక్కడ ఇక్కడ ఆమె ప్లస్‌
X
తమిళ స్టార్‌ కార్తి హీరోగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'సర్దార్‌'. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై తమిళ ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈయన గత చిత్రం సుల్తాన్ తమిళం మరియు తెలుగులో పాజిటివ్‌ రెస్పాన్స్ ను దక్కించుకుంది. అందుకే సర్దార్‌ సినిమాపై సహజంగానే అంచనాలు పెరుగుతాయి. పైగా ఈ సినిమా లో పలు ప్రత్యేకతలు ఉండటం వల్ల అంచనాలు మరింతగా పెరుగుతున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు రివీల్‌ చేసిన సిమ్రాన్‌ పాత్ర సీక్రెట్ సినిమా పై మరింతగా అంచనాలు పెంచేలా చేసిందంటూ ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.

కోలీవుడ్‌ మరియు టాలీవుడ్‌ లో మంచి గుర్తింపు ఉన్న సీనియర్‌ స్టార్‌ నటి సిమ్రాన్‌. గతంలో ఈమె ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించింది. సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సిమ్రాన్‌ అడపా దడపా ఆఫర్లు దక్కించుకుంటుంది. అయితే ఆమె సర్దార్ సినిమా తర్వాత వరుసగా సినిమాలు దక్కించుకుని బిజీ అవ్వబోతుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఎందుకంటే సర్దార్‌ సినిమాలో సిమ్రాన్‌ నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది. నటిగా తన విశ్వరూపంను అందులో చూపించబోతుంది అంటూ వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

కార్తి సినిమాలు అంటే తెలుగు మరియు తమిళంలో కూడా బజ్ ఉంటుంది. అలాంటిది రెండు భాషల్లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉన్న సిమ్రాన్‌ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా సినిమాకు అక్కడ ఇక్కడ ప్లస్ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. తమిళనాడు తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సర్దార్‌ సందడి కి సిమ్రాన్‌ తనవంతు స్టార్‌ డమ్ ను యాడ్‌ చేయడం ఖాయంగా తెలుస్తోంది. కరోనా వల్ల ఆలస్యంగా షూట్‌ అవుతున్న సర్దార్‌ సినిమా ను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సర్దార్‌ తర్వాత సిమ్రాన్ కు తెలుగు లో కూడా మంచి ఆఫర్లు రావాలని ఆమె సన్నిహితులు మరియు అభిమానులు ఆశిస్తున్నారు.