Begin typing your search above and press return to search.

తమన్నా 'కావాలయ్యా' సాంగ్.. ఇదెక్కడి క్రియేటివిటీరా బాబు!

By:  Tupaki Desk   |   12 July 2023 8:11 PM IST
తమన్నా కావాలయ్యా సాంగ్.. ఇదెక్కడి క్రియేటివిటీరా బాబు!
X
ప్రస్తుతం టెక్‌ వరల్డ్​లో విపరీతంగా వినిపిస్తున్న పదం 'ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌'. టెక్‌ రంగం లోనే కాదు.. ఆర్టిస్ట్‌ల ఊహా శక్తికీ ఇది రెక్కలు తొడుగుతోందని చెప్పాలి. ఇప్పటికే ఈ జనరేటివ్ ఏఐ సాయంతో క్రియేట్​ అవుతున్న ఫొటోస్, వీడియోలు.. ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో పుల్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఏఐ టూల్స్‌తో సిద్ధం అవుతోన్న ఏ కంటెంట్‌ అయినా సరే.. యూజర్స్​కు మంచి ఫన్​ అందిస్తోంది. ఇంకా ఎక్కువ సమయం సోషల్ మీడియా లోనే గడిపేలా చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా వేసిన లేటెస్ట్‌ హుక్‌ స్టెప్పుల కు సంబంధించి వేరే హీరోయిన్స్‌ చిందులేస్తే ఎలా ఉంటుందో అంటూ ఈ ఏఐ టూల్స్‌తో పలు వీడియోలు క్రియేట్​ చేశారు.

'వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి'.. అంటూ రజనీకాంత్‌ 'జైలర్‌'లో హీరోయిన్​ తమన్నా చేసిన స్పెషల్‌ సాంగ్‌ ప్రస్తుతం యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. ముఖ్యంగా ఈ సాంగ్​లో తమన్నా వేసిన హుక్‌ స్టెప్ బాగా పాపులర్ అయింది. ఎక్కడ చూసినా ఇదే కనపడుతోంది. సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతోంది. దీంతో హుక్‌ స్టెప్పుల ను క్రియేట్‌ చేయాలంటూ తమన్నా ఓ స్పెషల్‌ వీడియో ను పోస్ట్ చేసింది. అందులో ఇద్దరు డ్యాన్సర్లతో కలిసి ఆమె వేసిన స్టెప్పులు.. మస్తు ట్రెండ్ అయింది.

అయితే ఇప్పుడా హుక్‌ స్టెప్పుల కు ఏఐ టూల్స్‌తో ఉపయోగించి వీడియోలు క్రియేట్‌ చేస్తున్నారు పలువురు నెటిజన్లు. అలా సీనియర్‌ హీరోయిన్‌ సిమ్రాన్‌, హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ 'వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి'.. సాంగ్​కు డ్యాన్స్‌ చేస్తే ఎలా ఉంటుందో అంటూ.. వీడియోలు క్రియేట్‌ చేసి వదులుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో ఫుల్​ ట్రెండ్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు.. ఆశ్చర్యపోతున్నాయి. భలే ఉన్నాయంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే తమన్నా-రజనీకాంత్​ నటిస్తున్న 'జైలర్'​ను నెల్సన్‌ దిలీప్ కుమార్​ తెరకెక్కిస్తున్నారు. మోహన్‌ లాల్‌, జాకీ ష్రాఫ్‌, శివరాజ్‌కుమార్‌, సునీల్‌, రమ్యకృష్ణ సహా పలువురు స్టార్స్​ ఈ చిత్రం లో ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వరల్డ్​ వైడ్​గా ఆగస్టు 10న ఈ సినిమా ఆడియెన్స్​ ముందుకు రానుంది.

దీంతో ప్రమోషన్స్​ను ప్రారంభించింది మూవీటీమ్​. ఇందులో భాగం గానే గత వారం ఫస్ట్​ సింగిల్ అంటూ 'వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి'.. సాంగ్​ను రిలీజ్​ చేశారు. అలా ఈ సాంగ్​ పుల్ పాపులర్ అయింది. అన్నీ చోట్లా ఇదే వినిపిస్తోంది. ఈ సాంగ్​లో తమన్నా గ్లామర్​, డ్యాన్స్​కు అందరూ ఫిదా అవుతున్నారు.