Begin typing your search above and press return to search.

'లక్ష్య' గ్లిమ్స్: శౌర్య తో రొమాన్స్ చేసే 'రొమాంటిక్' బ్యూటీ..!

By:  Tupaki Desk   |   13 Aug 2021 1:13 PM GMT
లక్ష్య గ్లిమ్స్: శౌర్య తో రొమాన్స్ చేసే రొమాంటిక్ బ్యూటీ..!
X
ఉత్తరాది గ్లామరస్ బ్యూటీ కేతిక శర్మ.. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న 'రొమాంటిక్' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఫస్ట్ సినిమా విడుదల కాకుండానే ఇండస్ట్రీ దృష్టిలో పడింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోతో కుర్రకారుకు మతులు పోగొట్టే కేతిక.. యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య సరసన ''లక్ష్య'' చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.

'లక్ష్య' చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. మరోవైపు దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్ర‌తీ శుక్ర‌వారం ఓ అప్డేట్ ను అందిస్తూ చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన శౌర్య - కేతిక ఇంటెన్స్ లవ్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో నేడు హీరోయిన్ కేతిక శర్మ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. రితిక అనే పాత్రలో బ్యూటిఫుల్ కేతిక నటించనున్నట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు.

'రొమాంటిక్' కంటే ముందే 'లక్ష్య' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. ఇదే కేతిక కు టాలీవుడ్ ఎంట్రీ సినిమాగా చెప్పవచ్చు. మరి 'లక్ష్య' అమ్మడి కెరీర్ కు ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశిస్తుందో చూడాలి. కాగా, 'లక్ష్య' చిత్రానికి ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఇండియాలో ప్రాచీన విలువిద్య (ఆర్చరీ క్రీడ) నేపథ్యంలో రూపొందుతున్న మొట్ట మొదటి స్పోర్ట్స్ డ్రామా. అలానే నాగ శౌర్య కెరీర్ లో మైలురాయి 20వ చిత్రం.

'లక్ష్య' చిత్రంలో విలక్షణ నటుడు జగపతి బాబు - సచిన్ కేడ్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు - శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయనున్నారు.