Begin typing your search above and press return to search.

బాహుబలి-రుద్రమ.. పోలికలే పోలికలు

By:  Tupaki Desk   |   22 July 2015 9:39 AM GMT
బాహుబలి-రుద్రమ.. పోలికలే పోలికలు
X
బాహుబలి రిలీజైంది. రికార్డులు తిరగరాసింది. 350కోట్లు వసూలు చేసింది. 500కోట్ల వసూలు చేసేట్టే కనిపిస్తోంది. ఇప్పటికీ థియేటర్లు కిటకిటలాడిపోతున్నాయి. అయితే ఈ వేళ రుద్రమదేవి 3డిని బాహుబలితో పోలుస్తూ జనాలు రకరకాలుగా ఊహించుకోవడం చర్చకొచ్చింది. ఈ రెండు సినిమాల్లో క్యారెక్టర్లు ఇంచుమించు ఒకేలా ఉన్నాయంటూ జనాలు సోప్‌ వేయడం మొదలెట్టేశారు.

బాహుబలి, రుద్రమదేవి ఇంచుమించు ఒకేసారి మొదలయ్యాయి. ఒకేసారి చిత్రీకరణలు పూర్తి చేసుకున్నాయి. అయితే బాహుబలి ముందు రిలీజై రికార్డులు తిరగరాసింది. ఒక నెలరోజుల గ్యాప్‌ లో రుద్రమదేవి 3డి రిలీజై పోతోంది. అయితే బాహుబలిలోని 4పాత్రలను పోలినవి రుద్రమదేవి చిత్రంలోనూ ఉన్నాయని ఊహిస్తున్నారంతా. వాస్తవానికి వీరత్వంలో రుద్రమదేవి శివుడికి ఏమాత్రం తీసిపోదు. బాహుబలిలో శివుడు పర్వతాలు, లోయలు, జలపాతాలు దాటుకుని మాహిష్మతిలో అడుగుపెడితే, రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యానికి అదే తీరుగా రారాణి అవుతుంది.

వీరత్వంలో శివుడు-రుద్రమదేవి ఒక్కటే. అలాగే వీరాధివీరుడు కట్టప్ప మాహిష్మతి రాజుకు బానిస. గోనగన్నారెడ్డి కాకతీయ సామ్రాజ్యానికి ఓ సామంతరాజు. బంధిపోటు. రుద్రమని ఎదిరించినా చివరికి మేలు చేసే పాత్ర ఇది. అంటే రాణీగారికి సేవ చేసేదే అని అర్థం. అలాగే శివగామి సైలెంట్‌ కిల్లర్‌. బాహుబలికి సపోర్ట్‌ ఇస్తూనే కట్టప్ప చేత చంపించేస్తుందని తొలి భాగం చూశాక అర్థమైంది. అదే తరహాలో కుట్రపూరితమైన పాత్రలో నిత్యామీనన్‌ నటిస్తోంది. రుద్రమదేవి వెనక బల్లెం లాంటిది ముక్తాంబ(నిత్యా) పాత్ర అని చెబుతున్నారు.

అలాగే తమన్నా బాహుబలిలో అవంతికగా నటించింది. అవంతిక దేవసేనను రక్షించే నమ్మకమైన బంటుగా నటించింది. అలాంటి పాత్రలోనే క్యాథరిన్‌ రుద్రమకు సపోర్టివ్‌ రోల్‌ లో చేస్తోంది. ఇలా ఏ కోణంలో చూసినా రుద్రమదేవికి బాహుబలి పోలికలు కనిపిస్తున్నాయి. అదీ మ్యాటరు.