Begin typing your search above and press return to search.

మహర్షి గ్రామానికి అత్తారింటి హీరో!

By:  Tupaki Desk   |   26 Nov 2018 9:01 PM IST
మహర్షి గ్రామానికి అత్తారింటి హీరో!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈమధ్యనే అమెరికాలో ఓ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చిన 'మహర్షి' టీమ్ ప్రస్తుతం ఆరెఫ్సీ లో రూ. 8 కోట్లతో నిర్మించిన ఒక భారీ విలేజ్ సెట్ లో పల్లెటూరికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ షూటింగ్ జరుతున్న సమయంలో ఒక అనుకోని అతిథి మహేష్ ను కలవడానికి వచ్చి మహర్షి టీమ్ ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

అలా సర్ ప్రైజ్ ఇచ్చిన అతిథి ఎవరో కాదు తమిళ హీరో శింబు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రామోజీ ఫిలిం సిటీలోనే శింబు తాజా చిత్రం 'వందా రాజవతాన్ వరువేన్' షూటింగ్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా 'అత్తారింటికి దారేది' కి ఇది రీమేక్. ఈ షూటింగ్ లో ఉన్న శింబు పక్కనే మహేష్ బాబు 'మహర్షి' షూటింగ్ జరుగుతోందని తెలుసుకొని మహేష్ ను కలవడానికి వచ్చాడు. ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ - శింబు లకు తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. సినిమాలో మహేష్ అమెరికా నుండి వచ్చిన తర్వాత సేంద్రీయ వ్యవసాయం చేపడతాడని.. అందుకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కార్పోరేట్ కంపెనీ హెడ్ గా ఉన్న మహేష్ పల్లెటూరికి వచ్చి వ్యవసాయం చేయడం.. రైతుల సమస్యలపై పోరాడడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందట. ఇక్కడే మహేష్ - నరేష్ ఫ్రెండ్ షిప్ సీన్స్ కూడా చిత్రీకరిస్తారని అంటున్నారు. ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.