Begin typing your search above and press return to search.

శ్రీలంక అమ్మాయిని పెళ్లాడనున్న శింబు?

By:  Tupaki Desk   |   25 Feb 2023 11:30 AM IST
శ్రీలంక అమ్మాయిని పెళ్లాడనున్న శింబు?
X
న‌టుడు నిర్మాత గాయ‌కుడు శింబు తనదైన ప్ర‌తిభ‌తోనే కాకుండా నిరంత‌ర వివాదాల‌తోను హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు. వాస్త‌వానికి అత‌డు వివాదాలతోనే ఎక్కువ‌గా లైమ్ లైట్ లో ఉంటాడు. శింబు గతంలో న‌య‌న‌తార - హ‌న్సిక‌ల‌తో డేటింగ్ చేసిన సంగ‌తి తెలిసిన‌దే. ప‌లువురు నటీమణులతో అతని శృంగార సంబంధాల గురించి మీడియాలో నిరంతరం క‌థ‌నాలొస్తూనే ఉన్నాయి. కానీ ఇవేవీ పెళ్లి వ‌ర‌కూ దారి తీయ‌లేదు.

అత‌డి లైఫ్ ఆద్యంతం నయనతార - హన్సికలతో అతని శృంగార సంబంధం ఎక్కువగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వివాదాల కారణంగా కొంత కాలం నటనకు విరామం ఇచ్చిన అత‌డు ఇటీవ‌లే  పరిశ్రమకు తిరిగి వచ్చారు. మొన్న‌టికి మొన్న‌ `వెంటు తానంత కాదు` సినిమా విడుదల కాగా.. త్వరలో అత‌డు న‌టించిన మరో పది సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. శింబుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా గాళ్స్ లో బోలెడంత క్రేజ్ ఉంది. అదే క్ర‌మంలో అతడి పెళ్లి గురించి ర‌క‌ర‌కాల ఊహాగానాలు ప్ర‌చార‌మ‌వుతున్నాయి. త‌మ ఫేవ‌రెట్ హీరో పెళ్లి కోసం అతని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంత‌లోనే శింబు తండ్రి టి.రాజేందర్ త్వరలో త‌న కుమారుడు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించార‌ని.. అయితే శింబు అందుకు  ఇష్టపడలేదని క‌థ‌నాలొస్తున్నాయి.

ఈ డైల‌మా న‌డుమ‌ అతని పెళ్లి వార్త పరిశ్రమలో దావానంలా వ్యాపించింది. శింబు ప్రస్తుతం కోటీశ్వరుడైన ఓ బిజినెస్ మేన్ కుమార్తెతో డేటింగ్ చేస్తున్నాడని ఊహాగానాలు సాగుతున్నాయి. ఆ అమ్మాయి శ్రీలంకకు చెందిన మెడికల్ స్టూడెంట్ అని శింబుకి వీరాభిమాని అని చెబుతున్నారు. ఆమె తండ్రి అనేక వ్యాపారాల్లో అజేయంగా ఎదిగిన గొప్ప వ్యాపారవేత్త.

శింబు స్వ‌గ‌తంలోకి వెళితే.. అసలు పేరు శిలంబరసన్ థెసింగు రాజేందర్. తమిళ చిత్ర పరిశ్రమలో ఆల్ రౌండ‌ర్ గా పాపుల‌ర్. నటుడిగా- కథా రచయితగా-సంగీత దర్శకుడిగా- రచయితగా- గాయకుడిగా- అద్భుతమైన డ్యాన్స‌ర్ గా- దర్శకుడిగా-నిర్మాతగా తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. తన ప్రతిభతో కష్టపడి చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసాడు. అతను అనేక వివాదాలను ఎదుర్కొన్నాడు. కానీ అతని నైపుణ్యం .. అభిరుచితో న‌టుడిగా కెరీర్ ని సాగించ‌గ‌లిగాడు.

తమిళ చిత్రసీమలో బాలనటుడిగా అరంగేట్రం చేయడంతో పరిశ్రమలో ప్రయాణం చాలా చిన్న వయస్సులోనే ప్రారంభమైంది. అతను 2002 సంవత్సరంలో కాదల్ వసుత్తిల్లై చిత్రంలో ప్రధాన పాత్రలో అద్భుతమైన పాత్ర పోషించిన తర్వాత పరిశ్రమలో విపరీతమైన ప్రజాదరణ పొందాడు.
ఇప్పుడు శింబు పెళ్లి దగ్గర పడుతుండడంతో తదుపరి కొత్త ప్రాజెక్ట్ లు చేస్తాడా లేక వాయిదా వేస్తాడా? అంటూ అభిమానుల్లో చ‌ర్చ మొద‌లైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.