Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు చైతూ పార్టనర్ కరుణించాడు

By:  Tupaki Desk   |   31 July 2016 10:26 AM IST
ఎట్టకేలకు చైతూ పార్టనర్ కరుణించాడు
X
ప్రేమమ్ సినిమా రీమేక్ రిలీజును కాస్త వెయిటింగులో పెట్టి మరీ డేట్లిచ్చినా కూడా.. అసలు ఈ సాహసం శ్వాసగా సాగిపో అనే సినిమా తాలూకు ఛాయలు మాత్రం టాలీవుడ్డులో ఎక్కడా కనిపించట్లేదు. కబాలి ప్రభంజనం అయిపోయాక అయినా సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తారని అనుకుంటే.. మనోళ్లు ఆగస్టు ఆగస్టు అంటూ జపం చేయడమే కాని డేటు మాత్రం చెప్పట్లేదు. దీనంతటికీ కారణం.. నాగచైతన్య పార్టనర్ అని వేరే చెప్పక్కర్లేదు.

ఆయనే శ్రీమాన్ శ్రీ శింబు వారు. అచ్చం ఎనబాదు మదమైయాద (భయపడటం అంటే పిచ్చితనమే.. అని తెలుగులో మీనింగ్) అంటూ ఈ సినిమాను తమిళంలో శింబు హీరోగా ఒకేసారి తెరకెక్కించాడు దర్శకుడు గౌతమ్ మీనన్. అయితే మీనన్ తో తలెత్తిన డిఫెరెన్సుల కారణంగా ప్యాచ్ వర్కుకు రానంటూ హ్యాండిస్తున్నాడంట ఈ తమిళ హీరో. దానితో తెలుగులో మాత్రం రిలీజ్ చేసి తమిళంలో పెండింగులో పెడదాం అంటే.. అప్పుడు సినిమా బిజినెస్ ఛాన్సులు గల్లంతయ్యే ఛాన్సుంది కాబట్టి.. ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి జారుకున్నాడు డైరక్టర్. ఈ సమయంలో సడన్ గా ఈ సినిమా త్వరలోనే రిలీజవుతోంది అంటూ శింబు నుండి తమిళ మీడియాకు కబురు అందింది.

అంటే మన శింబు డైరక్టర్ పై కరుణించి ఇక షూటింగుకు రానున్నాడని చెప్పకనే చెబుతున్నాడనమాట. ఇంకెందుకు లేటు.. త్వరగా తెలుగు రిలీజ్ డేట్ కూడా ప్రకటించండి బాస్. ఇప్పటికే ఆగస్టు అండ్ సెప్టెంబర్ ప్యాక్ అయిపోతున్నాయి ఇక్కడ.