Begin typing your search above and press return to search.

టైం ఇవ్వు పిల్లా అంటున్న శింబు..!

By:  Tupaki Desk   |   8 Dec 2022 5:41 AM GMT
టైం ఇవ్వు పిల్లా అంటున్న శింబు..!
X
హీరోగానే కాదు కొంతమంది స్టార్స్ తమలో ఉన్న మరో టాలెంట్ ని కూడా సినిమాలకు వాడేస్తుంటారు. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ శింబు తన సింగింగ్ టాలెంట్ కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు తన సినిమాల్లో ఏదో ఒక పాట పాడి ప్రేక్షకులను అలరించే శింబు ఇప్పుడు బయట హీరోల సినిమాలకు కూడా పాడుతున్నారు. ఇటీవలే రామ్ ది వారియర్ కోసం బుల్లెట్ బండి పాట పాడగా లేటెస్ట్ గా నిఖిల్ 18 పేజెస్ కోసం టైం ఇవ్వు పిల్లా అనే సాంగ్ పాడారు. గోపీసుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ఈ సాంగ్ స్ప్షల్ గా ఉంది.

క్యాచీ ట్యూన్ తో.. యూత్ ఆడియన్స్ మెచ్చే సాహిత్యంతో శింబు పాడిన ఈ టైం ఇవ్వు పిల్లా సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. శింబు పాడటమే కాదు ఆ పాటకి ఒక సిగ్నేచర్ స్టెప్ కూడా ప్లాన్ చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా టైం ఇవ్వు పిల్లా సాంగ్ ఆ సిగ్నేచర్ స్టెప్ రీల్స్ ప్రత్యక్షమవుతున్నాయి. మ్యూజిక్ నేర్చుకోకపోయినా సంగీత దర్శకుడికి ఆ సాంగ్ కి కావాల్సిన టోన్ లో శింబు పాడతాడు. అందుకే అతను పాడిన పాటలన్ని సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.

కుదిరితే అతన్ని హైదరాబాద్ రప్పించడం లేదంటే ఆయనే కచ్చితంగా పాడాలి అనుకుంటే మన వాళ్లు చెన్నై వెళ్లి మరీ శింబుతో పాట పాడించుకుంటున్నారు. శింబు పాటతో తమిళంలో కూడా నిఖిల్ 18 పేజెస్ సినిమాకు క్రేజ్ ఏర్పడింది. నిఖిల్ ఆల్రెడీ ఈ ఏడాది కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ కొట్టాడు.

ఆ క్రేజ్ తోనే 18 పేజెస్ సినిమాని బిజినెస్ చేస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న 18 పేజెస్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు.

సుకుమార్ అందించిన కథతో సూర్య ప్రతాప్ 18 పేజెస్ మూవీ తెరకెక్కింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ మూవీ నిర్మిస్తున్నారు. సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

ఈ నెల 23న రిలీజ్ ప్లాన్ చేసిన 18 పేజెస్ మూవీ టీం త్వరలో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. శింబు పాడిన టైం ఇవ్వు పిల్ల సాంగ్ తో మాత్రం సినిమాపై స్పెషల్ బజ్ ఏర్పడిందని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.