Begin typing your search above and press return to search.
వచ్చాడండీ... వెయ్యి కోట్ల హీరో
By: Tupaki Desk | 6 Jun 2018 7:02 PM ISTశింబు... తెలుగోళ్లకు కూడా బాగా తెలిసిన తమిళ హీరో. ఒక దశలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నా కాస్త క్రమశిక్షణ తక్కువవడంతో ఫేడవుటైన హీరో. ఆయన నవ రసాలు పలికిస్తాడా లేదా అన్నది పక్కన పెడితే ఆయనతో పనిచేసేవారు... సినీ అభిమానులు మాత్రం ఆయన్ను చూసి నవరసాలు పలికిస్తారు. షూటింగుకు ఎప్పుడొస్తాడో ఎప్పుడు రాడో అర్థం కాక దర్శకనిర్మాతలు - టెక్నిషియన్లు ఆయన్ను తిట్టుకుంటారు.. అలా అని అదే పనా అనుకోవద్దు. ఏదో టైంకి వచ్చి ఇరగదీసికి యాక్షన్ చేసేసి దర్శకులను హ్యాపీ చేసేస్తాడు.
ఇక సగటు సినీ అభిమానుల సంగతికొస్తే.. అప్పుడెప్పుడో వచ్చిన మన్మధ లాంటి సినిమా మళ్లీ శింబు నుంచి రాలేదని ఆయనపై అలిగేవారు కొందరైతే నయనతార లాంటి సూపర్ ఫిగర్ ను పటాయించాడని అసూయపడేవారు మరికొందరు. అంతేకాదు... నయన్ ను ఫుల్లుగా వాడుకుని వదిలేశాడని ఆగ్రహించేవారు ఇంకొందరు. ఏదేమైతేనేం శింబు పేరు వినిపిస్తే చాలు అది టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. తాజాగా మరోసారి ఆయన టాక్ ఆఫ్ ది సినీ టౌన్స్ అయ్యారు.
నాకు వెయ్యి కోట్ల ఆస్తి ఉంది.. నాకు నచ్చినట్లు జీవిస్తా అని ఆయన తన యాటిట్యూడ్ చూపించుకున్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? శింబు రీసెంటుగా ఒకేసారి మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు. అందులో సొంత డైరెక్షన్ ఒకటి - ఇంకోటి గౌతమ్ మీనన్ తో ఒకటి ఉన్నాయి. అయితే.. ఆయన మూడు సినిమాలు ప్రకటించగానే సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు మొదలు పెట్టారు. మూడు సినిమాలు తీస్తే సరిపోదు.. టైంకి షూటింగ్ స్పాట్ కు వచ్చి అవి పూర్తయ్యేలా పనిచేయడం నేర్చుకోమంటూ విమర్శలు చేశారు.
దీంతో శింబు ఆ విమర్శలకు కౌంటర్ గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. అందులో తన రేంజేంటో చెప్పుకొనేలా పొగరుగా తన అభిప్రాయాలు వ్యక్తంచేశాడు. తన మొదటి సినిమాకే 10 గంటలకు వెళ్లానని.. తానెప్పుడూ ఇలానే ఉంటానని అందులో చెప్పాడు. తనకు రూ.1000 కోట్ల రూపాయల ఆస్తి ఉందని.. సినిమా అంటే ఇష్టం కాబట్టి ఇందులో కొనసాగుతున్నాను కానీ, లేకపోతే తనకు అవసరమే లేదన్నట్లుగా మాట్లాడాడు. అయినా తన వల్ల ఎవరూ ఇబ్బందిపడకుండా ఉండేందుకు తన ప్రవర్తన మార్చుకుంటున్నట్లు తెలిపాడు. మొత్తానికి కిందపడ్డా తనదే పైచేయి అనే రకం శింబు అని మరోసరి ప్రూవ్ అయింది.