Begin typing your search above and press return to search.

జైలుకు రెఢీ అంటున్న యువహీరో

By:  Tupaki Desk   |   17 Jan 2016 9:44 AM IST
జైలుకు రెఢీ అంటున్న యువహీరో
X
కాలక్షేపం కోసం.. సరదాగా పాడిన ఒక పాటతో లేనిపోని కష్టాల్ని కొని తెచ్చుకున్న తమిళనాడు యువ హీరో శింబు వ్యవహారం తెలిసిందే. అశ్లీలంగా ఉందంటూ తమిళనాడులోని మహిళా లోకమంతా తీవ్రస్థాయిలో మండిపడుతున్న వేళ.. అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయి.. బయటకు రావటానికి శింబు ఇష్టపడటం లేదు. ఈ పాట పాడినందుకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన కేసుకు సంబంధించిన విచారణ కోసం ఈ నెల 19న కోవై పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి.

శింబుతో పాటు.. యువ సంగీత దర్శకులు అనిరుధ్ కూడా కోవై పోలీస్ స్టేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శింబు.. అనిరుధ్ లు పోలీస్ స్టేషన్ కు వెళతారా? లేదా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామలు చూస్తుంటే.. వీరిద్దరూ మంగళవారం కోవై పోలీస్ స్టేషన్ కు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

తాజా వివాదంలో తాను జైలుకు వెళ్లటానికి సైతం సిద్ధమేనంటూ శింబు వెల్లడించాడు. తమిళనాడును విడిచి పెట్టి వెళ్లిపోయినట్లుగా వస్తున్న వార్తల్ని ఖండించిన శింబు.. తాను అండర్ గ్రౌండ్ లోకి వెళ్లలేదని.. తాను తమిళనాడును విడిచి పెట్టలేదని.. తాను ఏ తప్పూ చేయలేదని కుండబద్ధలు కొట్టారు. పోలీస్ స్టేషన్ కు హాజరు కావటానికి ముందే.. ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏమైనా.. జరగబోయే పరిణామాలకు శింబు మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నట్లుగా తాజా పరిణామాలు చెప్పకనే చెప్పేస్తున్నాయి.