Begin typing your search above and press return to search.

శింబు ఏజ్ కూడా పెంచేసుకున్నాడట?

By:  Tupaki Desk   |   26 Sept 2016 3:14 PM IST
శింబు ఏజ్ కూడా పెంచేసుకున్నాడట?
X
కేరక్టర్లతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఆడియన్స్ కు షాక్ ఇవ్వడంలో కోలీవుడ్ హీరో శింబు దిట్ట. ఒకవైపు లవర్ బోయ్ రోల్స్ చేస్తూనే.. చిత్రవిచిత్రమైన రోల్స్ చేసేందుకు కూడా సై అనేస్తుంటాడు. గౌతమ్ మీనన్ తీస్తున్న అచ్చాం యెంబదు మదమైయాద చిత్రంలో లవర్ బోయ్ గా నటిస్తున్న శింబు.. ప్రస్తుతం అంబానవన్ అసరాధావన్ అడంగధావన్(ఏఏఏ) అనే మూవీలో కూడా నటిస్తున్నాడు.

త్రిష.. ఇలియానా.. నయనతార చిత్రాన్ని తీసిన దర్శకుడు అధిక్.. ఈ ఏఏఏ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఏఏఏ చిత్రంలో శింబు మూడు పాత్రలు పోషిస్తున్నాడనే సంగతి తెలిసిందే. ఇందులో ఒక పాత్ర పేరు మధురై మైఖేల్ కాగా.. ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిపోయింది. ఇప్పుడు మరో పాత్ర గురించి రివీల్ చేసి.. దర్శకుడు పెద్ద షాక్ నే ఇచ్చాడు. ఈ పాత్రలో ఏకంగా 60 కిలోల వృద్ధుడి రోల్ లో కనిపించనున్నాడు ఎస్టీఆర్.

'శింబు మొదటిసారిగా 60 ఏళ్ల వృద్ధిగా చేస్తున్న ఆ పాత్ర పేరు అశ్విన్ తాత. ఇంత బరువు పెరిగి.. అంత కష్టపడ్డ శింబుకు కృతజ్ఞతలు' అంటున్నాడు దర్శకుడు అధిక్. ఇక మైకేల్ పాత్రకి జోడీగా శ్రియ నటిస్తుందనే టాక్ ఉంది. ఇప్పటికే ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆసక్తిని కలిగిస్తున్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఏఏఏ చిత్రంలో కీలక పాత్ర పోషించనుందని తెలుస్తోంది