Begin typing your search above and press return to search.

లేదు లేదన్నా.. శృతిని ఇరికిస్తున్నారు

By:  Tupaki Desk   |   5 Feb 2016 4:00 AM IST
లేదు లేదన్నా.. శృతిని ఇరికిస్తున్నారు
X
అసలు నేను ఆ సినిమాలో ఎటువంటి ఐటెం సాంగు చేయట్లేదు బాబోయ్‌ అన్నా కూడా.. మనోళ్ళు ఎలాగొలా ఇరికించేస్తున్నారు. మార్కెటింగ్‌ ఎత్తుగడ అనండి.. లేకపోతే వేరే ఎటువంటి ఆధారం లేక ఈమె మీదనే ఆధారపడుతున్నారు అనండి.. శింబు హీరోగా తీసిన ''ఇదు నమ్మ ఆలు'' (తెలుగులో ట్రూ ట్రాన్లేషన్‌.. 'ఇది నా పెళ్ళాం') సినిమా కోసం పడుతున్న తిప్పలు ఇన్నీ అన్నీ కాదు.

ఇప్పటికే ఓ సంవత్సరం పాటు లేటైన ఈ సినిమాకు చాలా కాంట్రవర్సీలు చాలా రకాలుగా ఉపయోగపడాలి. శింబు బీప్‌ సాంగ్‌ ఇష్యూ అయితేనేమీ.. నయనతార కొత్త ప్రియుడు విఘ్నేష్‌ న్యూస్‌ అయితేనేమీ (నయన ఈ సినిమాలో హీరోయిన్‌).. ఇక సింగర్‌ ఆండ్రియా జెరీమియాపై కొన్ని సంఘాలు విముఖత వ్యక్తపరచడం అయితేనేమీ.. చాలా విషయాలే ఉన్నాయి. అయినా కూడా మనోడు మాత్రం.. ఈ సినిమా కోసం శృతి హాసన్‌ ఒక పాట పాడిన సందర్భంలో తీసిన ఫోటోలను తెగ ప్రమోట్‌ చేస్తున్నాడు. ఏదో అందరూ ఈ సినిమాలో శృతి హాసన్‌ యాక్టింగ్‌ లో మెరిసింది అనుకోవాలని కాబోలు.. ఈ కామెడీ వేషాలేస్తున్నాడు శింబు.

ఏంటో కుర్రాడు.. ఇలా శృతిని ఇరికించినంత మాత్రాన హిట్టొస్తుందా?? అలాగే ఈ సినిమాలో శృతి హాసన్‌ ఎటువంటి ఐటం సాంగూ చేయట్లేదు.