Begin typing your search above and press return to search.

తప్పు చేశా.. ఐయామ్ సారీ- హీరో

By:  Tupaki Desk   |   8 Dec 2017 4:27 PM IST
తప్పు చేశా.. ఐయామ్ సారీ- హీరో
X
తమిళ స్టార్ శింబు తన తప్పును ఒప్పుకున్నాడు. శింబు వల్ల తనకు రూ.20 కోట్ల నష్టం వచ్చిందంటూ మైకేల్ రాయప్పన్ అనే తమిళ నిర్మాత అతడిపై తీవ్ర ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ గొడవకు సంబంధించి ముందు ఎదురుదాడి చేసిన శింబు.. ఆ తర్వాత కొంచెం తగ్గాడు. ఈ వివాదంలో తన తప్పు కూడా ఉందని అతని అంగీకరించాడు. ఈ ఒక్క తప్పు విషయంలోనే కాదు.. మొత్తంగా ఇప్పటిదాకా తాను చేసిన తప్పులన్నింటికీ తనను క్షమించాలంటూ అతను అభిమానులకు విజ్నప్తి చేయడం విశేషం. తాను తన అభిమానులకు మాత్రమే జవాబుదారీ అని.. అందుకే వాళ్లకు సారీ చెబుతున్నానని శింబు చెప్పాడు.

‘ఏఏఏ’ సినిమాను తాను అభిమానుల కోసమే చేశానని.. కానీ ఆ సినిమా అనుకున్న ప్రకారం రాలేదని.. కానీ నిర్మాత మొత్తం తప్పంతా తన మీద వేసేయడం కరెక్ట్ కాదని శింబు అన్నాడు. సినిమా రిలీజైన ఆరు నెలల తర్వాత ఇప్పుడొచ్చి గొడవ చేయడంలో ఆంతర్యమేంటని అతను ప్రశ్నించాడు. తాను సినిమాలు చేయకుండా ఎవ్వరూ ఆపరేరని.. తాను తన అభిమానుల్ని ఎంటర్టైన్ చేయడం మాననని అతనన్నాడు. మణిరత్నం సినిమా నుంచి తనను తప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని.. కానీ అది అబద్ధమని.. జనవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అతను వెల్లడించాడు. మణిరత్నం తనతో ఇప్పటికీ సినిమా చేయాలనుకుంటున్నాడంటే.. ఆయన కూడా తన అభిమానేమో అని శింబు చమత్కరించడం విశేషం.