Begin typing your search above and press return to search.

చైతు సాహసం సాగనివ్వని శింబు

By:  Tupaki Desk   |   24 Jun 2016 9:45 AM IST
చైతు సాహసం సాగనివ్వని శింబు
X
అక్కినేని నాగచైతన్య హీరోగా.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం విడుదలకు సిద్ధమయిపోతోందనే ఫీలర్లు వినిపిస్తూనే ఉన్నాయి. హంగామా చూస్తే రిలీజ్ డేట్ సెట్ కాక ఆగారు కానీ.. ఈపాటికి విడుదల కావాల్సిన సినిమానే అనిపించేట్లుగా ఉంది. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరేగా ఉంది. అసలీ సాహసానికి ఇంకా క్లైమాక్స్ షూటింగ్ చేయాల్సి ఉంది. దానికి ఇప్పుడు శింబు ఝలక్ ఇస్తున్నాడు.

ఇది తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రం అని.. తమిళ్ వెర్షన్ కి హీరో శింబు అనే విషయం తెలిసిందే. ఇప్పుడు క్లైమాక్స్ షూట్ విషయంలో శింబు నుంచి క్లారిటీ రావడం లేదు. అసలు షూటింగ్ కి వచ్చేట్టుగా కూడా కనిపించడం లేదంటున్నారు. ఇందుకు కారణం తెలుగు వెర్షన్ ఆడియో రిలీజ్ కి ఈ తమిళ హీరోని ఆహ్వానించకపోవడమే అని తెలుస్తోంది. అంతే కాదు.. ఇప్పటివరకు తమిళ వెర్షన్ ఆడియా ఫంక్షన్ ఎప్పుడు చేస్తారో కూడా డిసైడ్ చేయకపోవడం కూడా శింబుకు కోపం తెప్పించిందని అంటున్నారు.

ఈ ఆహ్వానాలు అందకపోవడానికి శింబు-గౌతమ్ మీనన్ ల మధ్య తలెత్తిన గత వివాదాలే కారణం అనే టాక్ ఉంది. మరిప్పుడు తమిళ్ వెర్షన్ ని గౌతమ్ మీనన్ ఏం చేస్తాడో.. అసలు కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడో లేదో కూడా తెలీడం లేదు. తెలుగు వెర్షన్ ని విడుదల చేసే అవకాశాలున్నాయా అని ఇండస్ట్రీలో జనాలు మాట్లాడుకుంటున్నారు.