Begin typing your search above and press return to search.

దళపతి విజయ్ తో శింబు పోటీనా..??

By:  Tupaki Desk   |   5 Jan 2021 11:00 AM IST
దళపతి విజయ్ తో శింబు పోటీనా..??
X
లాక్ డౌన్ కారణంగా ఇన్నినెలలు సినిమా థియేటర్లు మూసేయడంతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ లేక ఓటిటిలకు అలవాటు పడ్డారు. కానీ సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని కూడా ఎదురు చూసారు. మొత్తానికి కోలీవుడ్ ఇండస్ట్రీలో సినీ యాక్టర్లకు, సినీ అభిమానులకు ఎంజాయ్ చేసే టైం వచ్చేసింది. ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వం సినిమా థియేటర్లలో 100% సీటింగ్ అనుమతి కల్పించింది. అందుకే ఈ సంక్రాంతికి అక్కడ థియేటర్ల వద్ద పోరుకు సిద్ధం అవుతున్నాయి సినిమాలు. ఇళయదళపతి విజయ్ నటించిన 'మాస్టర్' రిలీజ్ అవుతుండగా.. ఏ సినిమా పోటీకి లేదని విజయ్ ఫ్యాన్స్ అంతా ఖుషి అయిపోయారు. కానీ నేనున్నా అంటూ తన సినిమాను పోటీకి దింపుతున్నాడు హీరో శింబు. శింబు తెలుగు వాళ్లకు కూడా సుపరిచితుడే.. కానీ అతని సినిమాలన్నీ ప్లాప్ అవుతుండటంతో తెలుగులో మార్కెట్ కోల్పోయాడని చెప్పాలి. అందుకే ఈ మధ్య తెలుగులోకి డబ్ చెయ్యట్లేదు.

ఇక మాస్టర్ సినిమాతో పోటీ విషయానికి వస్తే.. సంక్రాంతికి కోలీవుడ్ రేసులో మాస్టర్ మాత్రమే ఉండటంతో అన్ని థియేటర్లలో అదొక్కటే నడుస్తుందని అనుకున్నారు. కానీ శింబు తను నటించిన ఈశ్వరన్ సినిమాను విడుదలకు సిద్ధం చేసాడు. మాస్టర్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారని తెలిసి మెల్లగా ప్రెస్ నోట్ వదిలాడు. 'మాస్టర్ సినిమాకి మా సినిమా పోటీ కాదు. విజయ్ నాకు మంచి బ్రదర్. అటు విజయ్ అన్న సినిమాను నా అభిమానులు చూడండి. నా సినిమాను విజయ్ అభిమానులు కూడా చూడండి. మొత్తానికి సినిమా ఇండస్ట్రీని కాపాడండి' అన్నట్లుగా రాసుకొచ్చాడు. అలాగే విజయ్ అభిమానులు అంటే నాకు కూడా ఇష్టమే. కానీ ఫ్యాన్స్ కోసం థియేటర్లో రిలీజ్ చేయాలనీ సినిమాను ఏడాది పాటు ఆపారు అది పెద్ద విషయం అంటూ విజయ్ ఫ్యాన్స్ కి ఐస్ వేసే ప్రయత్నం చేసాడు. కానీ మాస్టర్ ముందు ఈశ్వరన్ చతికిలపడటం ఖాయం అంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి మాస్టర్ కి ఈశ్వరన్ పోటీనా లేక సపరేటేనా అనేది.