Begin typing your search above and press return to search.

ప‌చ్చ‌ద‌నాన్ని హ‌రిస్తే మ‌ర‌ణ‌శాస‌న‌మే..సింబా `ది ఫారెస్ట్ మ్యాన్`

By:  Tupaki Desk   |   23 Aug 2021 11:13 AM GMT
ప‌చ్చ‌ద‌నాన్ని హ‌రిస్తే మ‌ర‌ణ‌శాస‌న‌మే..సింబా `ది ఫారెస్ట్ మ్యాన్`
X
పాన్ ఇండియా అన్న థాట్ ఇప్పుడు కంటెంట్ ని డిసైడ్ చేస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ యూనిక్ కంటెంట్ తో ప్ర‌యోగాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. కాన్సెప్ట్ బేస్డ్ క‌థ‌ల‌తో తెలుగు ఆడియెన్ స‌హా యూనివ‌ర్శ‌ల్ ఆడియెన్ ని మెప్పించాల‌న్న పంతం క‌న‌బ‌రుస్తున్నారు. చూస్తుంటే `సింబా` ఆ కేట‌గిరీలోకే వ‌స్తుంద‌ని అనిపిస్తోంది.

మాస్ సినిమాల‌తో టాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్న సంపత్ నంది టీమ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `సింబా- ది ఫారెస్ట్ మ్యాన్` చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించింది. తాజాగా ఈ సినిమా థీమ్ ని ఎలివేట్ చేస్తూ ఒక యానిమేటెడ్ వీడియోను విడుదల చేసారు. ప‌చ్చ‌ద‌నాన్ని హ‌రిస్తే మ‌ర‌ణ‌శాస‌న‌మే..సింబా `ది ఫారెస్ట్ మ్యాన్` అంటూ ప‌వ‌ర్ ఫుల్ విజువ‌ల్ ని విడుద‌ల చేశారు. యానిమేష‌న్ ఎంతో క్వాలిటీగా ఆక‌ట్టుకుంది. ఇది ఆడియెన్ లో భారీ అంచనాలను పెంచడంతో పాటు సినిమా కంటెంటై పైనా కొంత క్లూ ఇచ్చింది. అడవులను నాశనం చేసి ప‌చ్చ‌ద‌నాన్ని హ‌రిస్తే వారికి మ‌ర‌ణం త‌ప్ప‌దు అన్న సిగ్న‌ల్ ఇస్తూ క‌థానాయ‌కుడి ఎంట్రీని ప‌వ‌ర్ ఫుల్ యానిమేటెడ్ విజువ‌ల్స్ ద్వారా ఎలివేట్ చేసిన తీరు ఆక‌ట్టుకుంది.

ఈ చిత్రానికి సంపత్ నంది రచ‌యిత‌. అత‌డు స్వ‌యంగా దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణ ప్రసాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించ‌నునండ‌గా.. ఈ చిత్రానికి కృష్ణ సౌరభ్ సంగీతం అందించ‌నున్నారు. సంపత్ నంది - రాజేందర్ రెడ్డి.డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌టీన‌టులు స‌హా ఇత‌ర విష‌యాల్ని త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.