Begin typing your search above and press return to search.

క‌నుమ‌రుగైన‌ వెండితెర స్టార్లు.. ఇప్పుడు ఎక్క‌డున్నారో?

By:  Tupaki Desk   |   30 April 2021 8:00 AM IST
క‌నుమ‌రుగైన‌ వెండితెర స్టార్లు.. ఇప్పుడు ఎక్క‌డున్నారో?
X
సినిమా ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఎవ‌రి ఫేట్ ఎలా మారిపోతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. అప్ప‌టి వ‌ర‌కూ స్టార్ గా ఉన్న హీరో.. అమాంతం అగాథంలోకి ప‌డిపోవ‌చ్చు. అనామ‌క పాత్రలు పోషించిన వారు టాప్ స్టార్ గా ఎదిగిరావొచ్చు. అందుకే.. జాత‌కాల‌కు ఎక్కువ విలువ ఇస్తుంటారు సినిమా ఇండ‌స్ట్రీలోని వారు. ఆ విధంగా జాత‌కాలు తిర‌గ‌బ‌డి ఫేట్ మారిపోయి, చివ‌ర‌కు ఇండ‌స్ట్రీ నుంచి వెళ్లిపోయిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో కొంద‌రి గురించి చూద్దాం..

జేడీ చ‌క్ర‌వ‌ర్తిః విల‌న్ గా ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించి.. ఆ త‌ర్వాత హీరోగా మారిపోయిన న‌టుడు జేడీ. హీరోగా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించాడు. గులాబీ, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావుర‌మా వంటి సూప‌ర్ హిట్లు అందుకున్నాడు. కానీ.. ఆ త‌ర్వాత ఆయ‌న స్టార్ డ‌మ్ ప‌డిపోయింది. మ‌ధ్య మ‌ధ్య‌లో ఒక‌టీ అరా చిత్రాలతో వ‌చ్చిపోతున్నాడు.

సుమంత్ః అక్కినేని వార‌సుడిగా తెరంగేట్రం చేసిన సుమంత్‌.. చాలా సినిమాల్లో న‌టించాడు. స‌త్యం, గౌరీ వంటి చిత్రాలు ఆయ‌న‌కు స‌క్సెస్ ను అందించాయి. కానీ.. ఆ త‌ర్వాత చేసిని సినిమాలు పెద్ద‌గా ఆడ‌లేదు. దీంతో.. క‌నుమ‌రుగ‌య్యాడు. ఈ మ‌ధ్య క‌ప‌ట‌ధారి చిత్రంతో వ‌చ్చినా.. నిరాశే ఎదురైంది. ఇలా.. ఎంతో మంది హీరోలు తెలుగునాట ఓ వెలుగు వెలిగి.. ఆ త‌ర్వాత క‌నుమ‌రుగ‌య్యారు.

త‌రుణ్ః ఫ‌స్ట్ మూవీతోనే ఇండ‌స్ట్రీ హిట్ కొట్టి.. అంద‌రి దృష్టినీ త‌న‌వైపు తిప్పుకున్న న‌టుడు త‌రుణ్‌. బాల న‌టుడిగా ఎన్నో చిత్రాల్లో క‌నిపించిన త‌రుణ్‌.. 'నువ్వేకావాలి' చిత్రంతో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత వచ్చిన ప్రియమైన నీకు, నువ్వే నువ్వే, నువ్వులేక నేను లేను చిత్రాలతో లవర్ బాయ్ అనే పదానికి అసలైన నిర్వచనంగా మారిపోయాడు. కానీ.. ఆ త‌ర్వాత జాత‌కం మారిపోయింది. చేసిన సినిమాల‌న్నీ ప‌రాజ‌యాలుగా మిగిలిపోవ‌డంతో.. ఇండ‌స్ట్రీ నుంచే నిష్క్ర‌మించాల్సి వ‌చ్చింది.

వేణుః 'స్వ‌యం వ‌రం' చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించి, తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న హీరో వేణు తొట్టెం పూడి. ఆ తర్వాత కూడా ప‌లు చిత్రాలు విజ‌య‌వంతం అయ్యాయి. క‌ల్యాణ రాముడు, చిరున‌వ్వుతో, హున‌మాన్ జంక్ష‌న్ వంటి సినిమాల‌తో స‌క్సెస్ అందుకున్న వేణు.. ఆ త‌ర్వాత ప‌రాజ‌యాల బాట ప‌ట్టాడు. చేసిన సినిమాల‌న్నీ ఫ్లాపులుగా మిగిలిపోవ‌డంతో క‌నుమ‌రుగ‌య్యాడు.

న‌వ‌దీప్ః న‌వ‌దీప్ తొలి చిత్రం 'జై'. ఆ త‌ర్వాత కూడా ప‌లు చిత్రాల్లో న‌టించిన ఈ హీరో.. సూప‌ర్ హిట్ అని చెప్పుకోద‌గ్గ సినిమా అనేది ఒక్క‌టీ చేయ‌లేక‌పోయాడు. చంద‌మామ వంటి చిత్రాలు ఫ‌ర్వాలేద‌నిపించాయి. కానీ.. అత‌ని కెరీర్ కు అవి ఏ మాత్రం స‌హ‌క‌రించ‌లేక‌పోయాయి. హీరోగా రిటైర్ అయిపోయి.. ఇత‌ర పాత్ర‌లు పోషిస్తున్నాడు.

రోహిత్ః 6టీన్స్ చిత్రంతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన ఈ హీరో.. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించాడు. కానీ.. స్టార్ గా మార‌లేక‌పోయాడు. వ‌రుస ఫ్లాపుల‌తో ఇండ‌స్ట్రీ నుంచి వెళ్లిపోయాడు.

వ‌డ్డే న‌వీన్ః ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో దుమ్ములేపిన హీరో వ‌డ్డీ న‌వీన్‌. కోరుకున్న ప్రియుడు, పెళ్లి వంటి ఎన్నో విజ‌యాల‌ను అందుకున్నాడు. అయితే.. ఆ త‌ర్వాత‌ వ‌రుస ప‌రాజ‌యాలు ఎదుర‌య్యాయి. దీంతో.. క్ర‌మంగా వెండి త‌ర‌కు దూర‌మ‌వుతూ వ‌చ్చాడు.