Begin typing your search above and press return to search.

వెండి తెర.. బుల్లి తెర ఇక ఓటీటీపై కింగ్

By:  Tupaki Desk   |   24 March 2021 11:30 AM GMT
వెండి తెర.. బుల్లి తెర ఇక ఓటీటీపై కింగ్
X
టాలీవుడ్‌ కింగ్ నాగార్జున హీరోగా సుదీర్ఘ కాలం పాటు స్టార్‌ హీరోగా వెలుగు వెలుగుతున్నారు. వెండి తెరపై స్టార్‌ గా కంటిన్యూ అవుతూనే మీలో ఎవరు కోటీశ్వరుడు షో తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బుల్లి తెరపై స్టార్‌ డం ను దక్కించుకున్న కింగ్ నాగార్జున త్వరలో ఓటీటీ ప్లాట్ ఫామ్ పై కూడా కనిపించబోతున్నట్లుగా ఆయన మాటలను బట్టి అర్థం అవుతోంది. మీలో ఎవరు కోటీశ్వరులు మరియు బిగ్ బాస్‌ షో లకు హోస్టింగ్‌ చేసిన తర్వాత ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యేందుకు నాగ్ ఓటీటీ వైపు కూడా చూస్తున్నాడని అనిపిస్తుంది. నాగార్జున నటించిన వైల్డ్‌ డాగ్‌ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటీటీ గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశాడు.

నాగార్జున మాట్లాడుతూ సినిమా లు అనేవి ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ ను ఎప్పటికి అందిస్తూనే ఉంటాయి. అయితే వెబ్‌ సిరీస్ లు అనేవి పరిమితులు లేకుండా చేసేందుకు అవకాశంను కల్పిస్తున్నాయి. మీరు ఓటీటీలో నటించే అవకాశం ఎంత వరకు ఉంది అంటూ ప్రశ్నించిన సమయంలో తప్పకుండా మంచి కథలతో వస్తే నటించేందుకు సిద్దం అన్నాడు. తనను తాను ప్రేక్షకులు విలక్షణంగా చూపించేందుకు నాగార్జున ఎప్పుడు సిద్దంగా ఉంటాడు. అందులో భాగంగానే ఓటీటీ కంటెంట్‌ లో కూడా నటించేందుకు ఓకే చెప్పాడు. ఏ డైరెక్టర్ మొదటగా నాగార్జునను ఓటీటీలో చూపిస్తాడో చూడాలి.