Begin typing your search above and press return to search.
జక్కన్న మౌనం వెనుక రహస్యం అదేనా?
By: Tupaki Desk | 30 Jan 2022 11:10 AM ISTమోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ వాయిదా పడటంతో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి ఖాళీ సమయం దొరికింది. దాదాపు మూడు సంవత్సరాల పాటు `ఆర్.ఆర్.ఆర్` చిత్రానికే సమయం కేటాయించడంతో విశ్రాంతి లేకుండా పోయింది. మధ్యలో బ్రేక్ లు తీసుకున్నా ఆలోచనలన్నీ `ఆర్.ఆర్.ఆర్` పైనే సాగేవి. ఆ రకంగా `ఆర్.ఆర్.ఆర్` సెట్స్ లో ఉన్నంత కాలం అవే ఆలోచనలు. అయితే ఇప్పుడా థాట్స్ నుంచి జక్కన్న పూర్తిగా బయటకు వచ్చేసారు. థర్డ్ వేవ్ తర్వాత రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో అప్పటివరకూ సినిమా గురించి ఆలోచించాల్సిన పనిలేదు.
మరి ఇప్పుడు రాజమౌళి ఏం చేస్తున్నట్లు? కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు ప్రారంభించారా? సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కించనున్న తదుపరి ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అయ్యారా? లేక మేనల్లుడు శ్రీసింహాతో తీయాలనుకున్న ప్రాజెక్ట్ పై బిజీగా ఉన్నారా? అంటూ రకరకాల ప్రశ్నలు .. అయితే వీటన్నిటికీ భిన్నంగా ఆయన మైండ్ లో కి ఇప్పుడు సినిమా అనే ఆలోచన లేకుండా గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి స్క్రిప్ట్ వర్క్ లో పాల్గొనకుండా నచ్చిన పుస్తకాలు.. నవలలు చదువుకుంటూ.... వెబ్ సిరీస్ లు వీక్షిస్తూ సమయాన్ని గడుపుతున్నారుట. ఇప్పటికే కొన్ని పుస్తకాల్ని చదివేసారుట.
అలాగే రాజకీయ ప్రముఖులకు సంబంధించిన పుస్తకాల్ని సీరియస్ గానే చదువుతున్నట్లు తెలిసింది. ఇక జీ-5 లో `లూజర్`..నెట్ ప్లిక్స్ లో `డికప్డ్ల్` వంటి సిరీస్ లను చూస్తున్నారుట. వాస్తవానికి రాజమౌళి ఏ పని చేస్తున్నా ఏదో సందర్భంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేస్తారు. అలాగే వాటికి సంబంధించిన రివ్యూలు కూడా ఇస్తుంటారు కానీ ఈసారి మౌనంగానే ఉన్నారు. ఎందుకంటే `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ వరకూ జక్కన్నకి ఈ మౌనం తప్పదు. `ఆర్.ఆర్.ఆర్` పై హైప్ ని ఎక్కడా కోల్పోకూడదనే రాజమౌళి ఇలా సైలెంట్ గా చక్కబెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.