Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ వదిలిన 'పుష్పక విమానం' లోని ‘సిలకా’ సాంగ్..!

By:  Tupaki Desk   |   15 March 2021 5:52 AM GMT
విజయ్ దేవరకొండ వదిలిన పుష్పక విమానం లోని ‘సిలకా’ సాంగ్..!
X
యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "పుష్పక విమానం". కొత్త దర్శకుడు దామోదర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో గీత్ సైని - శాన్వి మేఘన హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సమర్పణలో 'కింగ్ ఆఫ్ ది హిల్' ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గోవర్ధన్ రావు దేవరకొండ - విజయ్ మట్టపల్లి - ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో 'పుష్పక విమానం' మూవీ నుండి ‘‘సిలకా’’ అనే మొదటి పాటను ఈరోజు సోమవారం ఆనంద్ దేవరకొండ అన్న విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.

''సిలకా ఎగిరిపోయావా ఆసలన్ని ఇడిసేసి ఎనకా.. సిలకా చిన్నబోయిందె సిట్టి గుండె పిట్ట నువ్వు లేక' అంటూ సాగే ఈ సాంగ్ కి రామ్ మిరియాల ట్యూన్ సమకూర్చారు. అంతేకాదు మరో గీత రచయిత ఆనంద్ గుర్రం తో కలిసి ఈ పాటకి సాహిత్యాన్ని కూడా అందించారు. ఈ సాంగ్ లో చమన్ బ్రదర్స్ అనే బ్యాండ్ పేరుతో మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల - కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ కనిపిస్తున్నారు. ఇందులో వీరిద్దరూ పాట పాడుతూ డాన్సులు చేస్తూ జోష్ తీసుకొచ్చారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశలో ఉన్న ‘‘పుష్పక విమానం’’ సినిమాని త్వరలోనే విడుదల చేయనున్నారు. మధ్యతరగతి కుటుంబాలలో పెళ్లి చుట్టూ జరిగే పరిస్థితుల నేపథ్యంలో ఈ కామెడీ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఇందులో ఆనంద్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కనిపించనున్నాడు. హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. నీల్ సెబాస్టియన్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ - నరేష్ - హర్షవర్థన్ - గిరిధర్ - కిరీటి - భద్రం - వైవా - హర్ష - అభిజిత్ - అజయ్ - సుదర్శన్ - శరణ్య - మీనా వాసు - షేకింగ్ శేషు తదితరులు నటిస్తున్నారు.