Begin typing your search above and press return to search.

సైమా 2016.. మొత్తం అవార్డులు ఇవే

By:  Tupaki Desk   |   1 July 2016 9:14 AM GMT
సైమా 2016.. మొత్తం అవార్డులు ఇవే
X
సింగపూర్ లో సైమా అవార్డుల వేడుక జరుగుతోంది. జూన్ 30, జూలై 1న దక్షిణాది భాషల చలనచిత్రాలకు అవార్డులు ఇస్తున్నారు. తొలి రోజున తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలకు అవార్డులు ఇవ్వగా.. టాలీవుడ్ కి సంబంధించి బాహుబలి - శ్రీమంతుడు చిత్రాలు ఆధిపత్యం చూపించాయి.

సినీమా అవార్డు ఫంక్షన్ మాదిరిగానే సైమాలో కూడా మెగాస్టార్ ప్రభంజనం కొనసాగింది. 150వ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న చిరంజీవికి సైమా వేడుకలో ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించారు. మెగాస్టార్ తో అలనాటి తారల నుంచి నేటి తరం నటీనటుల వరకూ కలిపి దిగిన ఓ సెల్ఫీ సైమా తొలిరోజు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక టాలీవుడ్ కి అందించిన అవార్డుల జాబితా ఇలా ఉంది.

ఉత్తమ చిత్రం- బాహుబలి
ఉత్తమ నటుడు- మహేష్ బాబు(శ్రీమంతుడు)
ఉత్తమ నటి- శృతి హాసన్(శ్రీమంతుడు)
ఉత్తమ దర్శకుడు- రాజమౌళి(బాహుబలి)
ఉత్తమ నటుడు (క్రిటిక్)- అల్లు అర్జున్(రుద్రమదేవి)
ఉత్తమ నటి(క్రిటిక్)- అనుష్క(రుద్రమదేవి)
యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియా- సమంత
ఉత్తమ సహాయ నటుడు- రాజేంద్ర ప్రసాద్(శ్రీమంతుడు)
ఉత్తమ సహాయ నటి- రమ్యకృష్ణ(బాహుబలి)
ఉత్తమ విలన్- దగ్గుబాటి రానా(బాహుబలి)
ఉత్తమ కమెడియన్- వెన్నెల కిషోర్(భలేభలే మగాడివోయ్)
జీవిత సాఫల్య పురస్కారం- ఎస్ జానకి
ఉత్తమ నూతన నటుడు- అక్కినేని అఖిల్(అఖిల్)
ఉత్తమ నూతన నటి- ప్రగ్యా జైస్వాల్(కంచె)
ఉత్తమ నూతన నిర్మాత- విజయ్ రెడ్డి మరియు శశిదేవ్ రెడ్డి(భలే మంచి రోజు)
ఉత్తమ నూతన దర్శకుడు- అనిల్ రావిపూడి(పటాస్)
సాంగ్ ఆఫ్ ది ఇయర్- రామ రామ (శ్రీమంతుడు)
ఉత్తమ సంగీత దర్శకుడు- దేవిశ్రీ ప్రసాద్(శ్రీమంతుడు)
ఉత్తమ కొరియోగ్రాఫర్- జానీ(టెంపర్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్- సెంథిల్ కుమార్(బాహుబలి)
ఉత్తమ గేయ రచయిత- సిరివెన్నెల సీతారామ శాస్త్రి(కంచె)
ఉత్తమ గాయకుడు- సాగర్ (జత కలిసే- శ్రీమంతుడు)
ఉత్తమ గాయని- సత్య యామిని(మమతల తల్లి- బాహుబలి)