Begin typing your search above and press return to search.

డీజే టిల్లుని ఇక్క‌డితో అపేయ్ అని ఎమోష‌న‌ల్ అయిన బాల‌య్య‌!

By:  Tupaki Desk   |   20 Oct 2022 10:30 AM GMT
డీజే టిల్లుని ఇక్క‌డితో అపేయ్ అని ఎమోష‌న‌ల్ అయిన బాల‌య్య‌!
X
నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె' సీజ‌న్ 1 పేరుకు త‌గ్గ‌ట్టే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి మోస్ట్ హ‌య్యెస్ట్ రేటెడ్ టాక్ షోగా ఐఎండీబీ రేటింగ్స్ ని ద‌క్కించుకుని అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. సీజ‌న్ ఫ‌స్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో రెట్టించిన ఉత్సాహంతో మైండ్ బ్లాక్ చేసే స‌రికొత్త ఎపిసోడ్ ల‌తో సీజ‌న్ 2ని మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ ల‌తో తొలి ఎపిసోడ్ ని విడుద‌ల చేశారు.

సీజ‌న్ 2 లోని ఫ‌స్ట్ ఎపిసోడ్ బంప‌ర్ హిట్ కావ‌డంతో సెకండ్ ఎపిసోడ్ ని లైన్ లో పెట్టేశారు. మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్‌, 'డీజే టిల్లు' ఫేమ్ సిద్దూ జొన‌క‌న‌ల‌గ‌డ్డ‌లు పాల్గొన్నారు. 'ఆహా' ఓటీటీలో అంద‌రి చేత ఆహా అనిపిస్తున్న అన్ స్టాప‌బుల్ సీజ‌న్ 2 ఎపిసోడ్ 2 ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు. ఈ షో తాజా ఎపిసోడ్ కి సంబంధించిన ఫ‌స్ట్ ప్రోమో నెట్టింట ఇప్ప‌టికే వైర‌ల్ అవుతూ ఆస‌క్తిని రేకెత్తించిన నేప‌థ్యంలో 2వ ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు.

ఫ‌స్ట్ ప్రోమోలో విశ్వ‌క్ సేన్‌, సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌ల‌ని బాల‌య్య త‌న‌దైన స్టైల్లో ఆడుకోగా స్టారింగ్ లోనే చ‌మ‌ట‌లు ప‌ట్టించేస్తున్నారు సార్ అని విశ్వ‌క్ సేన్ అన‌డం.. దానికి బాల‌య్య ప‌డి ప‌డి న‌వ్వ‌డం తెలిసిందే. ఈ స‌ర‌దా సంభాష‌ణ‌లో తాజా ఎపిసోడ్ పై భారీ హైప్ ని క్రియేట్ చేసిన బాల‌య్య 'డీజే టిల్లు' హీరో సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌, విశ్వ‌క్ సేన్ చెప్పిన మాట‌ల‌కు ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారి ఎపిసోడ్ పై హైప్ ని, ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఈ సంద‌ర్భంగా బాల‌య్య క‌ళ్లు చెమ్మ‌గిల్లాయి. ఇండ‌స్ట్రీలో నువ్వు ఎదుర్కొన్న అవ‌మానం ఏంట‌ని బాల‌య్య అడిగితే 'నేను హీరోగా చేద్దాం అనుకుంటున్నా అన్నా అని ఓ వ్య‌క్తి ద‌గ్గ‌ర‌కు వెళ్లి చెబితే.. ఏంటీ మ‌చ్చ‌లలేసుకుని హీరో అయిపోదామ‌నుకుంటున్నావా నువ్వు...'అని అవ‌మానించాడంటూ చెప్పుకొచ్చాడు. ఆ మాటలు విన్న బాల‌య్య మ‌న‌సు చివుక్కుమంది.. వెంట‌నే 'నాకొస్తున్నాయ్ క‌న్నీళ్లిప్పుడు..నువ్వు అక్క‌డితో ఆపేసి ఇటు రామ్మా.. అంటూ సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌ని బాల‌య్య ఆలింగ‌నం చేసుకున్న తీరు అక్క‌డి వారిని భావోద్వేగానికి లోన‌య్యేలా చేసింది.

ఆ త‌రువాత‌ విశ్వ‌క్ సేన్ ని కూడా త‌ను బిగ్ ట్ర‌బుల్ ని ఫేస్ చేసిన సంద‌ర్భాన్ని చెప్ప‌మ‌ని బాల‌య్య అడిగితే..'దాస్ కీ ధ‌మ్కీ' సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ న‌టిస్తూ డైరెక్ట్ చేస్తున్నాను. ఇదే స‌మ‌యంలో నిర్మాత‌ల బంద్ మొద‌లైంది. అది ఎండ్ అవుతున్న స‌మ‌యంలో..మా సిస్ట‌ర్ హెల్త్ అప్ సెట్ అయింది.

ఐదారు రోజులు ప‌రిస్థితి ఎలా వుందంటే రాత్రి హాస్పిట‌ల్ కి వెళ్ల‌డం ఉద‌యాన్నే షూటింగ్ సెట్ కి రావ‌డం..క‌ట్ అన‌గానే మానిట‌ర్ వెన‌క్కి వెళ్లి ఇక్క‌డినే ఏడుస్తూ వుండే వాడిని. ఏం చేయ‌లేని ప‌రిస్థితి. డ‌బ్బు పోతే పోయింది.. సెట్ పోతే పోయింది..అక్క ఎక్కువ అని అటు వెళ్ల‌లేను.. సినిమానీ వ‌ద‌ల‌లేను' అంటూ విశ్వ‌క్ సేన్ కూడా బాల‌య్య ఎమోష‌న‌ల్ అయ్యేలా చేశాడు. ఈ ఎపిసోడ్ 'ఆహా'లో అక్టోబ‌ర్ 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.