Begin typing your search above and press return to search.

పిక్ టాక్: లిప్ లాక్ కు రెడీ అయిన 'డీజే టిల్లు'

By:  Tupaki Desk   |   4 Sept 2021 6:19 PM IST
పిక్ టాక్: లిప్ లాక్ కు రెడీ అయిన డీజే టిల్లు
X
‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ చిత్రంతో అలరించిన టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ.. ఇప్పుడు ''డీజే టిల్లు'' గా ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. 'అట్లుంటది మనతోని' అనే ట్యాగ్ లైన్ తో ఈసారి బ్యూటీ నేహాశెట్టి తో కలిసి వస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన టైటిల్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో టీజర్ ను విడుదల చేయడానికి చిత్ర బృందం రెడీ అయింది.

''డీజే టిల్లు'' సినిమా టీజర్ ను రేపు ఆదివారం సాయంత్రం గం. 04:05 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా 'ఒకే బబుల్ గమ్ ఇద్దరం తింటాం.. అట్లుంటది మనతోని' అంటూ ఓ రొమాంటిక్ పోస్టర్ ని వదిలారు. ఇందులో సిద్ధు - నేహశెట్టి ఒకరినొకరు దగ్గరకు తీసుకొని లిప్ లాక్ కోసం రెడీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. టీజర్ ఎలా ఉండబోతోందో ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది.

విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ సిద్ధు - విమల్ కలిసి రాస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రిన్స్ - బ్రహ్మాజీ - ప్రగతి - నర్రా శ్రీనివాస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. గతేడాది ‘నరుడి బ్రతుకు నటన’ పేరుతో ప్రకటించబడిన చిత్రాన్నే ఇప్పుడు ''డీజే టిల్లు'' గా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.